టెన్నిస్ కోర్టులో స్టార్ ప్లేయర్ సానియామీర్జా ఆటను ఇక చూడలేం. టెన్నిస్‌కి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించింది సానియా. 20ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విజయాలు కొన్ని అపజయాలు. కానీ భారత క్రీడాపతాకని రెపరెపలాడించడంలో ఆమె ఎప్పుడూ ముందుంది. హోమ్‌టౌన్ హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో చివరి మ్యాచ్‌తో టెన్నిస్ కెరీర్‌ని సానియామీర్జా ముగించింది. భవిష్యత్తులో పిల్లలకు టెన్నిస్ కోచింగ్‌పై దృష్టి పెట్టాలనుకుంటోంది సానియామీర్జా. తన కుమారుడి కోసం ఎక్కువ టైం కేటాయించాలనుకుంటోంది.
బ్యాడ్మింటన్ ఆటనుంచి తప్పుకున్నాక సానియామీర్జా ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు అప్పుడే సమాధానం దొరికింది. ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మహిళా టీంకు ఇకనుంచి మెంటర్ సానియామీర్జానే. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జాను మెంటర్‌గా ఎంచుకోవడం ఆర్సీబీ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచింది. భర్త షోయబ్‌మాలిక్ పాక్ క్రికెటర్ అయినా సానియామీర్జాకి ఆ ఆటగురించి పెద్దగా పరిజ్ఞానం లేదు. అయితే ఆమెకున్న అనుభవం ఆర్సీబీ ప్లేయర్లకు స్ఫూర్తినిస్తుంది.
ఆర్సీబీలో భాగంకావడంపై సానియామీర్జా కూడా ఆనందంగా ఉంది. క్రికెట్ గురించి తనకేమీ తెలియదంటూనే తానేం చేయబోతున్నానో తన టీమ్ అమ్మాయిలతో ఏం మాట్లాడబోతున్నానో అన్నదానిపై ఎగ్జైట్‌మెంట్‌తో ఉంది. దేశంలో మహిళా అథ్లెట్లకు ఏ ఆటలోనైనా స్ఫూర్తినిచ్చేందుకు తన తోడ్పాటు ఉంటుందంటోంది సానియా మీర్జా. యాడ్స్‌లో కనిపించే సానియామీర్జాకు ఫిల్మ్ ఇండస్ట్రీపై ఏమాత్రం ఇంట్రస్ట్ లేదు. అందుకే గతంలో బాలీవుడ్‌లో అవకాశం వచ్చినా తిరస్కరించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్‌ని వదిలేసి ప్రీమియర్ క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెడుతోంది. ఇందులోనూ తన ప్రతిభను నిరూపించుకుంటుందేమో చూడాలి.