బతుకమ్మ సంబరాల గురించి పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

By KTV Telugu On 10 October, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రాలో సంక్రాంతి కి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలంగాణలో బతుకమ్మ పండుగకు అంత ప్రాముఖ్యతనిచ్చి జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆట ఆడతారు ఆరవ రోజు అర్రెo అని. బతుకమ్మనైతే పేర్చరు అమ్మవారి అలకతీరాలని ప్రార్థిస్తారు. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహిస్తారు. స్కూల్స్ కిఎలాగూ సెలవులు ఉన్నాయి . బ్యాంకులకు కూడా నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. అయితే సద్దుల బతుకమ్మ కు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ అత్యంత ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ సంద‌ర్భంగా సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10వ తేదీన ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది.

తెలంగాణలో బతుకమ్మ పండుగను గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని , రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించారు. ఈ బతుకమ్మ ఉత్సవాలను brs ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరిపించింది. తెలంగాణ సాంప్రదాయ పండగ అయిన బతుకమ్మ అంటే తెలియని వాళ్లు ఉండరు. అయితే.. బతుకమ్మ పండుగల్లో భాగంగా అక్టోబర్ 10వ తేదీన జరుపుకునే సద్దుల బతుకమ్మకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది.
మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు ఇప్పటికే వినతిపత్రం అందజేశారు. 10వ తేదీన ఆప్షనల్‌ హాలిడే కాకుండా అధికారిక సెలవుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించి.. సద్దుల బతుకమ్మను పబ్లిక్ హాలీడేగా ప్రకటించినట్లు గుర్తు చేశారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు బతుకమ్మ పండుగ రోజు పెయిడ్ హాలీడే ప్రకటించాలని కోరారు.

మరో వైపు ఈ పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మహిళల నుండి వ్యతిరేకత కూడా కనిపిస్తున్నది. బతుకమ్మ అంటేనే brs అని .brs ప్రభుత్వం లేకపోవడం తో పండుగ ఉత్సాహమే లేదని మరి కొందరు అంటున్నారు. 10 సంవత్సరాల నుండి పండగ కు చీరలు అందుకుంటున్న స్త్రీలు రేవంత్ తీరును తప్పు పడుతున్నారు. మొదటి నుండి సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ చీరల్లో ఎన్నో అవక తవకలు జరిగాయని వ్యతిరేకం గా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం చీరల బదులు డబ్బులు ఇస్తామని ఒకసారి కాదు చీరలే ఇస్తామని ఒకసారి. మంత్రులు రకరకాల వార్తలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏదీ అందలేదని కొంతమంది అసంతృప్తివ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి