ఖమ్మం లో గెలుపు పై కాంగ్రెస్ ఫుల్ కాన్పిడెన్స్ తో ఉంది.అసెంబ్లీ ఎన్నికల మెజార్టీ దాటుతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం తాము కూడ గట్టిపోటి ఇచ్చాము.ఓ సామాజిక వర్గం ఓట్లు తమకే ఎక్కువ పడ్డాయని తమదే గెలుపు అన్న భరోసాతో ఉంది.అటు బీజేపీ సైతం సైలెంట్ ఓటింగ్ తమకు అనుకూలంగా మారింది తాము కూడా రేసులో ఉన్నామంటుంది.అసలు ఖమ్మం గుమ్మంలో గెలుపు ఎవరిది?.ప్రధాన పార్టీల లెక్కలు ఏ విధంగా ఉన్నాయి. ఇవాళ పొలిటికల్ కారిడార్ లో చుద్దాం.
ఖమ్మం పార్లమెంట్ స్థానంకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు పై దీమాతో ఉన్నారు.ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ రేపుతోంది. ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపైనే కాకుండా ఎవరికి ఏన్ని ఓట్లు వస్తాయి ఏ పార్టీ అభ్యర్థి ఎంత మోజార్టీతో గెలవబోతున్నారన్న దానిపై భారీగా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.ఇప్పటి వరకు 100 కోట్లు బెట్టింగ్ దాటిందన్న ప్రచారం నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో ఖమ్మం రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని జిల్లాలు ఒక్క ఎత్తైయితే ఖమ్మం రాజకీయాలు మరోలా ఉంటాయి.నేతల తలరాతలనే మారుస్తూ ఉంటారు ఇక్కడ ఓటర్లు.కాంగ్రెస్ నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి పోటి చేయగా.బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్ రావు పోటి చేశారు.బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావ్ పోటి చేశారు.
మూడు పార్టీలు పోటాపోటిగా ప్రచారం నిర్వహించాయి. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు ప్రచారంలో పాల్గోన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుపున సీఏం రేవంత్ రెడ్డి తో పాటు హీరో వెంకటేష్ ప్రచారం నిర్వహించగా. బీఆర్ఎస్ తరుపున మాజీ సీఏం కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా తో పాటు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గోన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అన్ని స్థానాల్గో గెలిచింది..అది కూడ భారీ మోజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.అందరికి 30వేల పై చిలుక మోజార్టీ వచ్చింది.
మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కలిపి 2లక్షల50వేల పైన మోజార్టీ వచ్చింది. అయితే ఆ మోజార్టీ ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ కు వస్తుందని ఆ పార్టీ నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మంచి నమ్మకం ఉందని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్పచారం నమ్మటంలేదని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ సైతం గెలుపు పై దీమాతో ఉంది.ఓ సామాజిక వర్గం ఓట్లు తమకే ఏక్కువగా పడ్డాయి తమకే అనుకులంగా మారబోతుందని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.
అంతేకాదు అధికార పార్టీ లో స్థానికంగా ఉన్న గ్రూప్ గొడవలు తమకు అనుకులంగా మారబోతున్నాయని చర్చించుకుంటున్నారు.కేసీఆర్ ప్రచారం సైతం తమకు కలిసి వచ్చిందని గులాబీ నేతలు చెబుతున్నారు. అటు బీజేపీ సైతం తాము కూడ రేస్ లో ఉన్నామన్న కాన్పిడెన్స్ తో ఉంది.సైలెంట్ ఓటింగ్ తమకే అనుకులంగా మారబోతుందని.అసలు బీఆర్ఏస్ పోటిలోనే లేదని.కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటి నడిచిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.వాస్తవానికి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో బీజేపీ కి అంత బలంలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీ,జనసేన పొత్తు తో పోటి చేయడంతో దారుణమైన ఫలితాలు వచ్చాయి.ఓ సెగ్మెంట్ లో కూడ 10వేలు మించి ఓట్లు రాలేదు.అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో మాత్రం దూకుడుగా వెళ్లింది. అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారం నిర్వహించారు. దీంతో బీజేపీ ఓటింగ్ పైనే సైతం ఉత్కంఠ మొదలైంది. మొత్తానికి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లొ త్రీముఖ పోటి నెలకోనడంతో ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు ఏంత మోజార్టీతో గెలవబోతున్నారన్నది మరి కొద్ది రోజుల్లో తేలనుంది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…