చేస్తున్నట్లుగా తెర ముందు కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వ మనుగడపై పదే పదే విమర్శలు చేయడం.. కాంగ్రెస్ లోని రేవంత్ ప్రత్యర్థులపై అనుమానం కలిగేలా ఆరోపణలు చేయడం ద్వారా తామే.. సీఎంను చికాకు పెడుతున్నామని.. బలహీనం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. నిజానికి వారు చేస్తోంది వేరు. రేవంత్ రెడ్డికి తిరుగులేకుండా చేస్తున్నారు. తమ నెత్తిమీద తాము చేయి పెట్టుకుంటున్నారు.
తెలంగాణలో విపక్షాలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం కన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డినే విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఉండదని హెచ్చరికలు పదే పదే వస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా తనపై కుట్ర జరుగుతోందని అంటన్నారు. రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్న అభిప్రాయంతో విపక్షాలు మరింతగా దాడి చేస్తున్నాయి. నిజానికి ఈ రాజకీయాలను కాస్త తరచి చూస్తే.. రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అనిపిస్తుంది.
ప్రభుత్వం ఏర్పడి.. ఏర్పడగానే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ మనుగడపై ప్రకటనలు ప్రారంభించారు. ముందుగా కడియం శ్రీహరి ఈ ఆరోపణలు చేశారు. ఎంతో కాలం ప్రభుత్వం ఉండదన్నారు. కానీ ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. హరీష్ రావు కూడా ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందో చెప్పలేమంటున్నారు. ఈ ఆరోపణల్ని అవకాశంగా తీసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని రేవంత్ రెడ్డి ఆకర్షిస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు అధికారికంగా చేరిపోయారు. మరో పాతిక మంది లైన్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ప్రారంభించింది. బీఆర్ఎస్ నేతల ప్రకటనలతో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రయత్నిస్తున్నాయని అందుకే .. ప్రభుత్వ స్థిరత్వం కోసం తప్పడం లేదన్న సంకేతాలను రేవంత్ పంపుతున్నారు.
ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమని మానవ బాంబులు రేవంత్ పక్కన నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు అంటూ ఉంటారు. వారిద్దరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ కూడా అవే ఆరోపణలు చేయడం ప్రారంభించింది. తాను షిండే అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీని సంప్రదించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉలిక్కి పడ్డారు. తనపై కాంగ్రెస్ పార్టీలో.. సీఎం రేవంత్ రెడ్డిలో విశ్వాసం తగ్గిపోతే .. అనుమానం పెరిగితే మొదటికే మోసం వస్తుందని..ఆయన ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని ప్రకటించారు.
నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయితేనే కోమటిరెడ్డి భరించలేకపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా మరో పదేళ్ల పాటు ఆయనే సీఎంగా ఉంటారని ఆయన నోటితోనే చెప్పాల్సి వచ్చింది. దానికి కారణం బీజేపీ, బీఆర్ఎస్ నేతలు.. ఆయన కాంగ్రెస్ పార్టీని చీల్చుతారంటూ చేసిన విమర్శలే. ఓ రకంగా ఇప్పుడు కాంగ్రెస్ లో .. రేవంత్ రెడ్డికి ప్రత్యర్తులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలు, బెదిరింపులను తనకు అనుకూలంగా మల్చుకుంటున్న రేవంత్ రెడ్డి క్రమంగా తన స్థానాన్ని బలపర్చుకుంటున్నారన్నది స్పష్టంగా కనిపిస్తున్న రాజకీయ సన్నివేశం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తే ఆయన మరింత బలపడతారు. పార్టీ హైకమాండ్ వద్ద పలుకుబడి పెంచుకుంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో పట్టు బిగిస్తారు.
ప్రభుత్వ మనుగడపై . కాంగ్రెస్ లోని అంతర్గత రాజకీయాలపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్లను అనుకూలంగా మల్చుకుని రేవంత్ రెడ్డి రోజు రోజుకు బలపడుతున్నారు. ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ తల్చుకున్నా కూడా కూల్చలేనంతగా మద్దతు పొందుతారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తూంటే.. రేవంత్ రెడ్డి కోసమే…కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను కూడా సాఫీ చేయడానికి.. విపక్ష పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయన్న సెటైర్లు ఇందుకే వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…