ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ స్కామ్లో కవిత పాత్రపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థలు అనుమానం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమెను విచారించాలని సీబీఐ నిర్ణయించింది.
ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద దర్యాప్తు అధికారి అలోక్ కుమార్ షాహి కవితకు నోటీసులు జారీ చేశారు. వచ్చే మంగళవారం అంటే 6వ తేదీన విచారిస్తామని వెల్లడించారు. వెలుగులోకి వచ్చిన కొన్ని వాస్తవాల ఆధారంగా స్కామ్ లో కవితకు సంబంధం ఉన్నట్లు గుర్తించామన్నారు. విచారించాల్సిన అవసరం ఉన్నందున ఆరో తేదీన కవితకు అనుకూలమైన ప్రదేశంలో విచారణకు చేపడతామన్నారు.
ప్లేస్ ఏదో నిర్ణయించుకునే ఛాయిస్ కవితకే వదిలేశారు. దానితో తన నివాసంలోనే వారిని కలుసుకుని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సుముఖంగా ఉన్నట్లు కవిత సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించిన 48 గంటల్లోనే ఆమెకు నోటీసులు అందడం విశేషం…