తెలంగాణ కేబినెట్ ప్రజలకు రూ. లక్షలు ఇచ్చే పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారికి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఆర్థిక సాయం చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దళితబంధులో 1.30 లక్షల కుటుంబాలకు రెండో విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుకు పది లక్షలు వస్తాయి. ఇస్తారా లేదా అన్న విషయం పక్కన పెట్టి మొత్తంగా ఈ లబ్ది చేకూరేది పక్కాగా ఆమలు చేస్తే ఐదు లక్షల కుటుంబాలకు. వీరికే లక్షలు ఇస్తే మరి మిగతా వాళ్లు ఊరుకుంటారా మోసపోయమని మెజార్టీ జనం అనుకుంటే ఎవరికి నష్టం.
సొంత జాగా ఉండి ఇండ్లు కట్టుకునే వారి ‘గృహలక్ష్మి’ పథకాన్ని తీసుకువచ్చింది. పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తొలి విడుతలో 4లక్షల మందికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోలేని పేదలకు ఆర్థిక సాయం చేస్తామని 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పటి వరకూ అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగు లక్షల ఇండ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. ఈ రూ.3 లక్షలను మూడు దఫాలుగా ఇస్తారు. ఒక్కో దఫాలో రూ.లక్షల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. లబ్ధిదారుడు తన ఇంటిని తనకు నచ్చిన విధంగా కట్టుకునే విధంగా నిబంధనలను సులభతరం చేస్తారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించామని హరీష్ రావు ప్రకటించారు. నిజానికి ఎనిమిదేళ్ల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల కథ నడుస్తుంది. ప్రజలకు ముఖ్యంగా పేదలకు ఎన్నెన్ని ఆశలు కల్పించాలో చెప్పాల్సిన పని లేదు. కట్టినవే అరకొర వాటినీ లబ్దిదారులకు అందించలేకపోయారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తి అంతా ఇంతా కాదు. వారి సంగతి తేల్చకుండా జాగా ఉన్న వారికి మూడు విడతల్లో మూడు లక్షలు వేస్తామని ముందుకు రావడం ఇతర వర్గాల్లో అసంతృప్తి కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది.
దళిత బంధు పథకంతో మూడో సారి అధికారంలోకి రావాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆ పథకమే గుదిబండగా మారుతోందని గుర్తించలేకపోతున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పథకం అమలు విషయంలో కేసీఆర్ ఇప్పటికీ ఓ స్పష్టమైన విధానపరమైన నిర్ణయం ప్రకటించలేదు. అందరికీ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు. చివరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇస్తామంటున్నారు. ఏ ప్రతిపాదిన ఇస్తారు ఎలా ఇస్తారు నిధులెక్కడి నుంచి వస్తాయన్నదానిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. ఒక్కోసారి పాక్షిక అమలు అంటారు ఇంకోసారి అందరికీ ఇస్తామంటారు. దీంతో ప్రజల్లో అనేకానేక సందేహాలు ప్రారంభమవుతున్నాయి. తాజాగా కేబినెట్ భేటీలో మరో లక్షా 30వేల మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో 18శాతం వరకూ ఉన్న దళిత కుటుంబాలు అందరికీ పథకం వర్తింప చేయడం ఆర్థిక పరంగా అసాధ్యం. 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ ఎంపికలు కూడా రాజకీయ ప్రమేయంతో జరిగాయి. ఇది అర్హులైన ఇతర దళితులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి పెంచుకోవడానికి కారణం అవుతోంది.
ఇప్పటికే దళితేతర వర్గాల నుంచి మాకు కూడా ఓ బంధు కావాలని డిమాండ్ పెరుగుతోంది. రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనే సరికి ప్రతీ కుటుంబం ఆశ పడటం సహజం. అలాంటి ఆశ అంతకంతకూ కుటుంబాల్లో పెరుగుతోంది. ఇతర రాజకీయ పార్టీలు దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. అంటే ఇతర వర్గాలకూ ఏదో ఓ పథకాన్ని ప్రవేశ పెట్టక తప్పదు. వారికి ఎలాంటి లబ్ది చేకూర్చకపోతే వారంతా వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది. వీటన్నింటిని కేసీఆర్ సమర్థంగా డీల్ చేయాల్సి ఉంది. లేకపోతే అన్ని వర్గాలకూ వ్యతిరేకమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క వర్గానికే సాయం చేస్తామంటే ఇతర వర్గాలు అసంతృప్తి చెందుతాయి. ఆ వర్గానికి పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే ఆ లక్ష్యమూ నెరవేరదు. ఇప్పుడు కేసీఆర్ అలా డీల్ చేస్తున్నారా లేదా అంటే చెప్పడం కష్టం. ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత కనిపించడానికి ఇలాంటివే ప్రధాన కారణాలు. మరో వైపు పన్నులు కట్టే వర్గం మరింత అసహనానికి గురవుతోంది.
కేసీఆర్ రాజకీయ వ్యూహాల సామర్థ్యంపై అందరికీ నమ్మకం ఉంది కానీ రాజకీయాల్లో పరిస్థితులు కూడా కలసి రావాలి. లేకపోతే అటు దళితులఓట్లు ఇటు ఇతర వర్గాల ఓట్లు కొన్ని తప్ప మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. అదే జరిగితే బంధు పథకాల కారణగానే ఓడిపోయారని తర్వాత విశ్లేషించుకోవాల్సి వస్తుంది.