దేశంలో ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తోందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం మోదీ అసలు తన పాలనా విజయాలను కాకుండా మతం లాంటి భావోద్వేగ అంశాలను హైలెట్ చేసుకుంటూ ఉండటమే. కానీ మోదీ వ్యూహం మోదీది. తాను వెనుకబడ్డానని ఆయన ఆ వ్యూహం పాటించడం లేదు.. ఓటర్లు ఏది ఎక్కువ కనెక్ట్ అయితే దాన్నే ఎంచుకుంటున్నారు. ఈ లాజిక్ ఇతర పార్టీలకు అర్థం కావడం లేదు. బీజేపీ ట్రాప్‌లో విపక్షాలు పడిపోయాయి.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి నిరాశజనక ఫలితాలు వస్తాయన్న ప్రచారం మీడియా, సోషల్ మీడియాల్లో బలంగా చేస్తున్నారు. మొదట్లో రిజర్వేషన్ల విషయంలో ఆత్మరక్షణ ధోరణితో ప్రచారం చేయడం , ఇప్పుడు మత పరమైన అంశాలను హైలెట్ చేస్తూండటం వల్ల ఇలాంటి అభిప్రాయం సామాన్యుల్లో కూడా వస్తోంది. ప్రధాని సహా ఇతర ప్రధాన నేతల ప్రసంగాలన్నీ తమకు ఎదురుగాలి వీస్తున్నదని తెలిసిపోయినట్టుగా సాగుతున్నాయని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధాని మోదీ తన పాలనా పనితనం గురించి చెప్పుకోవడం లేదని విమర్శిస్తున్నారు. కానీ ప్రధాని మోదీ రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే.. ఆయనవిపక్షాలకోసం రాజకీయాలు చేయరు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలో అన్నదానిపైనే ఆయన దృష్టి ఉంటుంది. అదే కోణంలో ప్రచారం చేస్తున్నారు.
దేశంలో పదేళ్ల పాటు మోదీ ఏం చేశారో చెప్పాలన్న ప్రశ్న పెద్దగా వినిపించడం లేదు. బీజేపీ కూడా చెప్పాలనుకోవడం లేదు. ఈ పదేళ్లలో వారు చేసిందేమిటో, తిరిగి అధికారమిస్తే చేయబోయేదేమిటో చెప్పి ఓట్లు అడగడం లేదు. ‘మోడీకీ గ్యారంటీ సంకల్ప పత్రం’ గురించిన ప్రస్తావన దాదాపు మానేశారు. మరి ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోందా అంటే అదీ లేదు. మోదీ ట్రాప్ లో పడిపోయారు. మోదీకి ఓటర్లను ఎలా ట్యూన్ చేయాలో బాగా తెలుసు. అందుకే మొదట్లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు కొల్లగొట్టి ముస్లింలకు ఇస్తుందన్న ప్రకటన చేశారు. తాము అలా అనలేదని కాంగ్రెస్ మొత్తుకున్నా… శామ్ పిట్రోడా అనే పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలతో మరింత బలంగా ప్రజల్లోకి పోయింది. ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మొదటి అడుగులో బోల్తా పడింది.
తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యాన రిజర్వేషన్ల అంశాన్ని హైలెట్ చేయాలనుకున్నారు. ఈ విషయంలో బీజేపీ నేరుగానే ఎటాక్ చేసింది. రిజర్వేషన్లు తీసేసే ప్రశ్నే లేదని ఏ మూల అనుమానం ఉన్న వారికి క్లారిటీ ఇచ్చింది. నమ్మేవారు నమ్ముతారు ., ఇప్పుడు మళ్లీ మోదీ తన మార్క్ ప్రచారం చేస్తూంటే కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కాంగ్రెస్ గెలిస్తే అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తారని మోదీ చెప్పారు.. ఇలాంటివి మోదీ స్థాయికి తక్కువ.. కానీ ప్రధాని స్థాయి నిలబడాలంటే ఖచ్చితంగా ఇలాంటి రాజకీయాల్ని చేయాల్సిందే. అది మోదీ విధానం. అది తప్పు అని.. కాంగ్రెస్ మోరల్ పాలిటిక్స్ చేస్తే… వెనుకబడటమే కానీ.. ముందుకొచ్చేదేమీ ఉండదు. మోదీ చేస్తున్న తాజా ఆరోపణలకు కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంటూ టైంపాస్ చేస్తోంది. ఓడిపోయేలా ఉన్నారని అలాగే మాట్లాడుతున్నా ఎదురుదాడి చేస్తున్నారు.
దేశంలో అభివృద్ధి రాజకీయాలకు ఆదరణ తక్కువ. ఆ విషయంలో ఎన్నో సార్లు రుజువు అయింది. అయితే అధికారంలో ఉన్న వారు అనేక మంది తాము అభివృద్ది చేశామని ఆ ఎజెండాగా ఎన్నికలకు వెళ్తారు. దాని వల్లనష్టపోయారు కానీ లాభపడిన వాళ్లు తక్కువ. ఈ సూక్ష్మాన్ని మోదీ గుర్తించారు. అభివృద్ధి ప్రచారం చేసుకుంటున్నారు కానీ.. దాన్నే హైలెట్ చేసుకోవడం లేదు. ప్రజలను ఎలా ట్యూన్ చేసి ఓట్లు రాబట్టుకోవాలో అలా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో భాగం అయి మరింతగా బీజేపీకి మేలు చేస్తోంది. బీజేపీ వెనుకబడిపోయిందని ప్రచారం చేసుకుని ఆనందపడటం తప్ప.. అసలు వ్యూహాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అక్కడే మొదటి తప్పటడుగు వేసినట్లయింది.
రాజకీయాల్లో తాము ఏం చేశామో చెప్పుకుని ఓట్లు అడగడం అనేది ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ప్రజల మైండ్ సెట్ కు తగ్గట్లుగా రాజకీయాలు చేసిన వారే సక్సెస్ అవుతున్నారు. దానికి మోదీనే ఉదాహరణ.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…