పాత, కొత్తల కలయికగా మలి జాబితా

By KTV Telugu On 28 October, 2023
image

KTV TELUGU :-

ఒకటి రెండు ఆశ్చర్యకర పరిణామాలు మినహా తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా అనుకున్న స్థాయిలోనే విడుదలైంది. పార్టీని బలోపేతం చేసే దిశగా చాలా మంది నేతలను ఆహ్వానించిన  కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో వచ్చిన వారందరికీ దాదాపుగా టికెట్లు కేటాయించింది. 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన ఏఐసీసీ, ఇప్పుడు 45 మందితో రెండో జాబితాను జనం ముందుంచుంది.  ఫస్ట్ లిస్టులో చోటు దక్కని సీనియర్లు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్  వంటి వారికి రెండో జాబితాలో అవకాశమిచ్చారు. మధు యాష్కీ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారు. పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్ నుంచి  బరిలోకి దిగుతారు…

కాంగ్రెస్ లో ఇటీవల చేరిన వారిలో 15 మందికి టికెట్లు కేటాయించడం ఈ సారి విశేషం. అందులో అనుకున్నట్లుగానే ఖమ్మం నుంచి  పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. వాళ్లిద్దరు కేసీఆర్ మీద అలిగి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. అలాగే ముథోల్ నియోజకవర్గం స్థానం నారాయణ్ రావు పటేల్ కు దక్కింది. కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. ఇటీవలే చనిపోయిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం కేటాయించింది. అదే విధంగా బీజేపీలోకి వెళ్లి అక్కడ ఇమడలేక వెనక్కి వచ్చిన .. ఆయనకు ఇష్టమైన మునుగోడు స్థానాన్ని అప్పగించింది. ఇప్పుడాయన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పోటీకి దిగుతారు. గత ఉప ఎన్నికల్లో రాజగోపాల్ పది వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. పరకాల  స్థానాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డికి, పినపాక టికెట్ ను పాయం వెంకటేశ్వర్లుకు కేటాయించారు.

సన్నిహితుడు రోహిన్ రెడ్డికి ఆశాభంగం కలిగింది. కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయనకు షాక్ తగిలింది. అంతేకాదు అనూహ్యంగా విజయారెడ్డి పేరు ఖరారు అయింది. తండ్రి పీజేఆర్ తనయగా విజయారెడ్డికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో ఇదే నియోజకర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆమె ఓడిపోయారు. కానీ ఓట్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో విజయారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన డివిజన్ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి విజయారెడ్డి కార్పొరేటర్‌గా గెలిచారు.

సామాజిక వర్గాల లెక్కలు చూస్తే కాంగ్రెస్ పార్టీ కుల  గణనకు పట్టు బడుతున్నప్పటికీ బీసీలకు పెద్దగా ఒరిగించిందేమీ లేదు. రాష్ట్రంలో ఆరవై శాతం మంది వరకు బీసీ జనాభా ఉంటుందని తాజా లెక్కలు చెబుతున్నప్పటికీ ఇంతవరకు ప్రకటించిన 100 స్థానాల్లో 15 మంది మాత్రమే ఆ వర్గం వారున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 37 స్థానాలు, బీసీలకు 15, వలమలకు 8 స్థానాలు, కమ్మ  సామాజిక వర్గానికి మూడు స్థానాలు, బ్రాహ్మణులకు రెండు స్థానాలు కేటాయించారు. ఎస్సీలు 19, ఎస్టీలు 12, మైనార్టీలు నాలుగు చోట్ల పోటీ చేస్తారు.

మొత్తం 19 స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో వామపక్షాలకు కేటాయించాలనుకున్న వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, సత్తుపల్లి స్థానాలు కూడా ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఇతర మిత్రపక్షాలతో చర్చలు ముగిసిన తర్వాత వారికి కేటాయించిన సీట్లను వదిలేసి మిగతా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించస్తారు. కమ్మ సామాజిక వర్గానికి మరో టికెట్ కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి