కేటీఆర్ ని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

By KTV Telugu On 2 October, 2024
image

KTV TELUGU :-

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా , బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు పలు ప్రాంతాలను సందర్శించిన విషయం తెలిసిందే. ఈరోజు పార్టీ మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు వెలుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేటీఆర్ వాహన శ్రేణిని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను అదుపు చేశారు. చాదర్ ఘాట్ మూషీరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ళ కూల్చివేతల బాధితులకు భరోసానిచ్చేందుకు కేటీఆర్ వెలుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల పట్ల నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ను అడ్దుకున్నారు. అలాగే మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని, అనవసరంగా ప్రజలను తప్పదోవపట్టిస్తూ, వారిని రెచ్చగొడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డి. తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలకు అండగా నిలబడుతూనే ఉంటామని అన్నారు. మమ్మల్ని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్ళకి భయపడను. మీ తాట తియ్యడానికి వచ్చాను. నీ పిల్లి కూతలకి భయపడేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. ఉద్యమాల పిడికిలి ఇది గుర్తు పెట్టుకో. బడుగు బలహీనుల గొంతులను నీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు. నీ గుండా రాజ్యాన్ని… నియంతృత్వ పాలనను సవాలు చేసే నా స్ఫూర్తిని నీ గుండాలు ఆపలేరు. నీ గుండాలు నా వాహనంపై చేసిన దాడి నాకు మరింత శక్తిని ఇస్తుంది. ఇట్లాంటివి మమ్మల్ని ఆపలేవు’ అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి