అటు.. బావ బామ్మర్దులు.. ఇటు రేవంత్.!
అసలు.. సభలో రేవంత్ రెడ్డిని చూస్తే.. తెలంగాణకు ఏం అర్థమవుతోంది.?
ఎస్.. ఒక చైనా సామెత ఉంటుంది. నాయకుల్ని తయారుచేయడమే.. నిజమైన నాయకత్వం అని.!
కొద్దో గొప్పో మన రాజకీయాలకు అది అతికినట్లుగా సూట్ అయ్యే సామెత. ఇప్పుడు.. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులు చూశాక.. పదే పదే అదే గుర్తొస్తోంది. తెలంగాణలో ఇవి.. మూడో విడత సమావేశాలు. బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, హరీశ్ రావు.. వాళ్లు ప్రస్తావించాలనుకుంటున్న అంశాలు, వాళ్లు వాదించాలనుకున్న పాయింట్స్, వాటి బ్యాక్ గ్రౌండ్ మొత్తం రెడీ చేసుకొని.. గ్రౌండ్‌లోకి దిగుతారు.
ఎందుకంటే.. పదేళ్లుగా వాళ్ల ఇండస్ట్రీ ఇదే. ఇదంతా.. వాళ్లకు కొట్టినపిండి. ఎదురుదాడి చేయడం, ఎదుటోళ్ల నోరు మూయించడం అనేది.. అధికారంలో ఉండగా అలవాటైంది. దాన్నే.. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. అయితే.. వీళ్లిద్దరి దూకుడుని తిప్పికొట్టేందుకు గానీ.. ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేందుకు గానీ.. కాంగ్రెస్ వైపు నుంచి సన్నద్ధత ఎంత ఉందీ అంటే.. సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది.
సరే.. మొదటి రెండు సమావేశాలంటే సరిపాయె. ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. సర్దుకోనికే కొంత సమయం కావాలనుకున్నాం. కానీ.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ.. గాడిన పడకపోగా.. ఉన్నకొద్దీ పరిస్థితి దిగజారుతున్నట్లు అనిపిస్తోంది.
కాంగ్రెస్ వైపు నుంచి గట్టిగా నిలబడి.. సమాధానం చెప్పే నాయకులు ఎవరున్నారు?
అంశాలవారీగా, ఆధారాలతో సహా.. రాజకీయ వాదనను రాజకీయంతో తిప్పికొట్టగల సమర్ధులు ఎవరున్నారు?
స్ట్రయిట్‌గా సమాధానం చెప్పి.. సభను తమ వైపు మలుపుకోగలిగిన వాళ్లు ఎవరున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే.. కాంగ్రెసోళ్ల దగ్గర కూడా సమాధానం లేదు.
అన్నింటికీ.. జిందా తిలిస్మాతే అన్నట్లు.. రేవంత్ రెడ్డే లేచి సమాధానం చెప్పాలి.! ఆయనే.. రాజకీయ ఆరోపణలు చేసి.. తిరిగి సభను దారికి తెచ్చుకోవాల్సి వస్తోంది.
మరి.. ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తోంది?
కాంగ్రెస్‌లో ఎప్పుడైనా సరే.. బలమైన నాయకత్వమనేది.. నాయకుడి చుట్టూ ఉండే బలాన్ని బట్టి నిర్ణయమవుతుంది.
మరి..
రేవంత్ మీద మిగతా లీడర్లకు గురి కుదరట్లేదా?
లేదంటే.. రేవంత్ తెలివైనోళ్లని తయారుచేసుకోలేకపోతున్నారా?
లేకపోతే ఆల్రెడీ తెలివి, వాదన, అనుభవం ఉన్నోళ్లని.. దగ్గర చేసుకోలేకపోతున్నారా?
ఈ లోపాలు ఎంత దాచినా.. బయటకు కనిపిస్తూనే ఉన్నాయ్.
ఆల్రెడీ తెలివిగా ఉండి, రాజకీయ చతురతతో.. తిప్పికొట్టగలిగిన వాళ్లు లేరా అంటే.. కాంగ్రెస్‌లోనూ అలాంటి లీడర్లు ఉన్నారు. కానీ.. వాళ్లెవరూ కూడా సీఎంకి మద్దతుగా మాట్లాడి.. రేవంత్‌ను బయటేసే విధంగా.. లేచి మాట్లాడుతున్న దాఖలాలు లేనే లేవు.
ఇక.. రేవంత్ చుట్టూ ఉన్న పరివారంలోనూ, ఆయన చేర్చుకుంటున్న వారిలో గానీ, లేకపోతే.. ఆయన దగ్గరకు తీసినవాళ్లు గానీ.. ఎవరూ సరైన ప్రిపరేషన్, సరైన డైరెక్షన్, గైడెన్స్ గానీ.. వాళ్లకు ఉన్నట్లు లేదు. అసలు.. ఆ గైడెన్స్ అవసరం, ,సబ్జెక్ట్ ఓరియెంటెడ్‌గా వాళ్లను తయారుచేసుకోవాలి, వీళ్లే రేపటి రోజు తనకి స్టెప్పింగ్ స్టోన్స్ అవుతారనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు లేదు.
ఇక.. మంత్రివర్గంలో ఉన్న వాళ్లు, సీనియర్ నాయకులంతా.. వేడుక చూస్తున్నట్లు ఉండిపోతారు. అది.. భట్టి విక్రమార్క అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా.. ఇంకొకరైనా.. ఇంకొకరైనా.. వారి మీద, వాళ్ల శాఖల మీద ఆరోపణలు గానీ, ప్రశ్నలు గానీ వస్తే లేస్తారు తప్పితే.. ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలనో.. ముఖ్యమంత్రి మా నాయకుడనో లేచి నిలబడి.. వాళ్లు కౌంటర్ చేసే సందర్భాలు ఉండట్లేదు.
అంటే.. దీనర్థం.. కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలు, లోపాలు, లిమిటేషన్స్‌ని.. బావ బామ్మర్దులు తిప్పికొట్టి.. అడ్వాంటేజ్‌గా మలుపుకుంటున్నారు. నిజానికి.. బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి.. జనంలో గానీ, సోషల్ మీడియాలో గానీ.. పెద్దగా రెస్పాన్స్ వస్తున్న దాఖలా ఏమీ లేదు. వాళ్ల పార్టీ పేజీలు, కార్యకర్తల హడావుడి తప్పితే.. జనరల్ పబ్లిక్‌లో పెద్ద చర్చేమీ జరగట్లేదు. కానీ.. కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్న దూకుడు చూస్తే.. అబ్బో.. వీళ్లు డామినేట్ చేస్తున్నారనే పరిస్థితికి వచ్చారు.
ఇది ఇలానే ఉంటే.. కాంగ్రెస్ చేజేతులా.. అడ్వాంటేజ్‌ని బీఆర్ఎస్‌కి అప్పగించినట్లైతది. బహుశా.. ముందు ముందు అదే జరుగుతుందేమో.! ఎందుకంటే.. జనం అభిప్రాయం ఎప్పుడూ.. ఏం కనబడుతోంది.. ఏం మాట్లాడుతున్నారు.. ఎవరు దూకుడుగా ఉన్నారు.. అనే దాన్ని బట్టే ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయ్. బహుశా.. భవిష్యత్తులో అదే జరగొచ్చేమో.!
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…