నకిలీ బిల్లులతో ప్రైవేట్ ఆసుపత్రిలో  CMRF భారీ కుంబకోణం…

By KTV Telugu On 28 August, 2024
image

KTV TELUGU :-

హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో..: అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ (ఐఎస్‌ సదన్‌ ఎక్స్‌ రోడ్‌), శ్రీకృష్ణ హాస్పిటల్‌, జనని హాస్పిటల్‌ (సైదాబాద్‌), హిరణ్య హాస్పిటల్‌ (మీర్‌పేట),డెల్టా హాస్పిటల్‌ (హస్తినాపురం), శ్రీరక్ష (బీఎన్‌రెడ్డి నగర్‌), ఎంఎంఎస్‌ హాస్పిటల్‌ (సాగర్‌ రింగ్‌ రోడ్‌), ఏడీఆర్‌ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (శారదానగర్‌), ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (కొత్తపేట), శ్రీసాయి తిరుమల హాస్పిటల్‌ (బైరామల్‌గూడ).

ఖమ్మం జిల్లా: శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, గ్లోబల్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, డాక్టర్‌ జేఆర్‌ ప్రసాద్‌ హాస్పిటల్‌, శ్రీవినాయక సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, శ్రీసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, వైష్ణవి హాస్పిటల్‌, సుజాత హాస్పిటల్‌, న్యూ అమృత, ఆరెంజ్‌ హాస్పిటల్‌, మేఘశ్రీ

హాస్పిటల్‌ నల్లగొండ జిల్లా: నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (మిర్యాలగూడ), మహేశ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (మిర్యాలగూడ), అమ్మ హాస్పిటల్‌, (నల్లగొండ) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: సప్తగిరి హాస్పిటల్‌ (జమ్మికుంట), శ్రీసాయి హాస్పిటల్‌ (పెద్దపల్లి)

ఉమ్మడి వరంగల్‌ జిల్లా: రోహిణి మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హనుమకొండ), శ్రీసంజీవిని హాస్పిటల్‌ (మహబూబాబాద్‌), సిద్ధార్థ హాస్పిటల్‌ (మహబూబాబాద్‌)

నకిలీ పేషెంట్లు, నకిలీ బిల్లులతో కొన్ని దవాఖానలు భారీ స్కామ్‌ నడిపినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. వీరు అక్రమార్గంలో చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌ (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి భారీగా నిధులు కొల్లగొట్టినట్టు ఆరోపణలున్నాయి. లేని రోగులను, రోగాలను సృష్టించి ఎలాంటి ఆపరేషన్‌ ఎక్విప్‌మెంట్‌ లేకపోయినా, ఆపరేషన్లు చేసినట్టు నకిలీ బిల్లులు చూపించి ఆయా దవాఖానల యాజమాన్యాలు రూ.కోట్లు దండుకున్నాయి.

ఈ భారీ కుంభకోణంలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పది, ఖమ్మం జిల్లాలో పది, నల్లగొండలో మూడు, ఉమ్మడి వరంగల్‌లో మూడు, కరీనంగర్‌లో రెండు ప్రైవేట్‌ దవాఖానలు ఉన్నట్టు సమాచారం. ఏడాదిన్నర క్రితమే ఈ తరహా కుంభకోణం మంచిర్యాల, హైదరాబాద్‌లో వెలుగు చూడటంతో నాటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ క్రమంలోనే సుమారు 28 ప్రైవేట్‌ దవాఖానలు కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ సొమ్మును కాజేసినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. సీఎంఆర్‌ఎఫ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ డీఎన్‌ మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతకాల ఫోర్జరీ, చీటింగ్‌ వంటి అంశాలపై తెలంగాణ సీఐడీ అధికారులు ఆరు ఎఫ్‌ఐఆర్‌లు, 17 కేసులు నమోదు చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌లోని వ్యక్తులు, ప్రైవేట్‌ దవాఖానల యాజమాన్యం, కొందరు ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది, అకౌంటెంట్‌ ఆఫీసర్లు అంతా చైన్‌లింక్‌గా ఏర్పడి ఈ భారీ మోసానికి తెరలేపినట్టు సీఐడీ గుర్తించింది. దీనిపై లోతుగా విచారణ కొనసాగుతున్నదని, ఈ కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌కు ముందు ఈ దందా జరిగినట్టు సమాచారం.

లేఖలపై ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు
ఈ ప్రైవేట్‌ దవాఖానలకు రెఫరెన్స్‌గా వస్తున్న ప్రభుత్వ డాక్టర్ల సంతకాలు సైతం బిల్లులపై ఉండటం అనుమానాలకు తావిస్తున్నది. నల్లగొండలోని మూడు దవాఖానల్లో రూ.50 కోట్లకు మేర నకిలీ బిల్లులతో డబ్బులు పొందినట్టు సమాచారం. ఫలానా శస్త్రచికిత్సకు ఫలానా రోగి తమ హాస్పిటల్‌లో జాయిన్‌ అయినట్టు నకిలీ లేఖలు ప్రభుత్వానికి పంపడం, డబ్బులు క్లెయిమ్‌ చేసుకోవడం వీరికి పరిపాటిగా మారింది. ప్రైవేట్‌ దవాఖానల్ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ఓ చైన్‌లింక్‌గా ఏర్పడి.. డబ్బులు దండుకునేలా పథకం రచించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రైవేట్‌ దవాఖానల దృశ్చర్య వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లింది. గతంలో ఇట్లాంటి కేసు ఒకటి హైదరాబాద్‌ సీసీఎస్‌లో నమోదైంది. దీనిపై నాటి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. హైదరాబాద్‌లో మొదట నాలుగు దవాఖానలను గుర్తించి చర్యలు తీసుకున్నారు. అయితే ఈ భారీ కుంభకోణం వెనుక అధికారులు, కొందరు నాయకుల పాత్రపై ఆరా తీస్తున్నారు.

త్వరలోనే అరెస్టులు..?
ఈ నకిలీ బిల్లుల్లో పేర్కొన్న రోగుల్లో ఏ ఒక్కరు కూడా వైద్యం చేయించుకోలేదు. అయితే వీరంతా వైద్యం చేసుకున్నట్టు, వాటికి బిల్లులు అయినట్టు రికార్డులు ఉన్నాయి. విచారణలో అవన్నీ నకిలీ బిల్లులుగా సీఐడీ అధికారులు తేల్చారు. వీటి వెనుక ఉన్నవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ అధికారుల, ప్రైవేట్‌ వైద్యుల హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నారు.

ఈనేపథ్యంలోనే ప్రైవేట్‌ దవాఖానల్లోని వైద్యులు, సిబ్బందిని విచారించేందుకు సీఐడీ బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. సమగ్ర దర్యాప్తు తర్వాత.. సూత్రధారులు, పాత్రధారులను అరెస్టు చేయనున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తులోనే పదుల సంఖ్యలోనే అరెస్టులు జరుగుతాయని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

సంవత్సరం కిందటే వెలుగులోకి..
జమ్మికుంట, ఆగస్టు 26: ఏడాది క్రితమే జమ్మికుంటలోని ఒక ప్రైవేట్‌ దవాఖానలో సీఎంఆర్‌ఎఫ్‌, ప్రైవేట్‌ బీమా సంస్థల దందా సాగినట్టు ఆరోపణలులొచ్చాయి. ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో సంవత్సరం కిందట సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌ బృందం రంగంలోకి దిగింది. అధికారులు ప్రైవేట్‌ దవాఖానలో విచారణ జరిపారు. దవాఖాన ఏర్పాటు, సీఎంఆర్‌ఎఫ్‌ కోసం, ప్రైవేట్‌ బీమా సొమ్ము కాజేసేలా ఇచ్చిన బిల్లులు, తదితర విషయాలపై ఆరా తీశారు.

రికార్డులు, బిల్లులు పరిశీలించగా, నకిలీ బిల్లుల బాగోతం బయటపడినట్టు తెలిసింది. కోట్లాది రూపాయల సొమ్ము కాజేసినట్టు అధికారులు గుర్తించనట్లు సమాచారం. అయితే, విచారణ సమయంలో దవాఖాన యాజమాన్యం (వైద్యులు) నకిలీ బిల్లులు తాము ఇచ్చినవి కాదని, దవాఖానలో పనిచేసే కొందరు సిబ్బంది కలిసి మోసానికి పాల్పడ్డారని అధికారులకు వివరించినట్టు తెలిసింది.

అక్రమాలకు పాల్పడిన దవాఖానలు
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో..: అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ (ఐఎస్‌ సదన్‌ ఎక్స్‌ రోడ్‌), శ్రీకృష్ణ హాస్పిటల్‌, జనని హాస్పిటల్‌ (సైదాబాద్‌), హిరణ్య హాస్పిటల్‌ (మీర్‌పేట),డెల్టా హాస్పిటల్‌ (హస్తినాపురం), శ్రీరక్ష (బీఎన్‌రెడ్డి నగర్‌), ఎంఎంఎస్‌ హాస్పిటల్‌ (సాగర్‌ రింగ్‌ రోడ్‌), ఏడీఆర్‌ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (శారదానగర్‌), ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (కొత్తపేట), శ్రీసాయి తిరుమల హాస్పిటల్‌ (బైరామల్‌గూడ).

ఖమ్మం జిల్లా: శ్రీ శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, గ్లోబల్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, డాక్టర్‌ జేఆర్‌ ప్రసాద్‌ హాస్పిటల్‌, శ్రీవినాయక సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, శ్రీసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, వైష్ణవి హాస్పిటల్‌, సుజాత హాస్పిటల్‌, న్యూ అమృత, ఆరెంజ్‌ హాస్పిటల్‌, మేఘశ్రీ

హాస్పిటల్‌ నల్లగొండ జిల్లా: నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (మిర్యాలగూడ), మహేశ్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ (మిర్యాలగూడ), అమ్మ హాస్పిటల్‌, (నల్లగొండ) ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: సప్తగిరి హాస్పిటల్‌ (జమ్మికుంట), శ్రీసాయి హాస్పిటల్‌ (పెద్దపల్లి)

ఉమ్మడి వరంగల్‌ జిల్లా: రోహిణి మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హనుమకొండ), శ్రీసంజీవిని హాస్పిటల్‌ (మహబూబాబాద్‌), సిద్ధార్థ హాస్పిటల్‌ (మహబూబాబాద్‌)

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి