హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూలుస్తూ సంచలనం రేపుతున్న హైడ్రా ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాకు ఉన్న అధికారాలను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్ వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
దీనిపై నేడు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. పిటిషన్ లో జీవో 99ను పిటిషనర్ సవాలు చేశారు. జీహెచ్ఎంసీ చట్టాన్ని కాదని హైడ్రాకు విశేష అధికారాలు ఎలా ఇస్తారని పిటిషనర్ వాదించారు. కాబట్టి, హైడ్రా చట్టబద్ధతను రద్దు చేయాలని కోరారు. దీంతో హైకోర్టు ధర్మాసనం ఇందులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఈ సందర్భంగా హైడ్రా వ్యవహార తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణలు తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తున్నారని హైడ్రాను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. జీవో 99పై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్పూర్లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆ నిర్మాణాన్ని కూల్చి వేశారని చెప్పారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ ను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తూ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చి జీవో 99ను ఛాలెంజ్ చేస్తూ లక్ష్మీ అనే మహిళ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ వాదించారు. జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం వాటి అధికారులను మరొక అధికారికి ఇవ్వకూడదని తెలిపారు.
జిహెచ్ఎంసికి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జివో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని ప్రస్తావించింది. వాదనల అనంతరం ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
హైడ్రాపై దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.
అలాగే హైడ్రాను రద్దు చేయాలనే పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించింది. జీఓ 99పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమీన్ పూర్లో కొన్ని షెడ్లు కూల్చివేశారన్న పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…