హైడ్రా కూల్చేవేతలు పలువురు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. రూపాయి రూపాయి కూడబెట్టుకొని నిర్మించిన కలల సౌధాలు క్షణాల్లోనే నేలమట్టం అవుతుండటంతో వారి బాధ వర్ణాణాతీతంగా మారుతోంది. అన్ని పర్మిషన్లు తీసుకున్నా.. కొందరు బిల్డర్లు, బడాబాబులు చేసిన మోసానికి తాము బలై పోయామంటూ వారు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా పెద్దలను వదిలేసి తమలాంటి పేదల ఇండ్లను కూల్చేస్తోందని మండిపడుతున్నారు. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన తల్లిదండ్రులు ఏడుస్తున్నా వినకుండా రేవంత్ సార్ తమ ఇంటిని కూల్చేశాడని చిన్నారి వాపోయింది. తన స్కూల్ బుక్స్, వాటర్ బాటిల్స్ అందులోనే ఉండిపోయాయని చెప్పగా.. చిన్నారి మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద, మధ్యతరగతి ప్రజల పొట్ట కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ఏమాత్రం కనికరం లేకుండా కూల్చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తుంటే.. తన కష్టాన్నంతా దారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. తాజాగా.. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ ఇంటిని రేవంత్ సార్ కూల్చేశారంటూ ఓ ఐదేళ్ల చిన్నారి చెప్పిన మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి. ఇల్లు కూల్చేయటంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. గత నెల రోజులకు పైగా హైడ్రా అధికారులు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన వందల అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతల్లో పెద్దల ఇండ్లను వదిలి మధ్యతరగతి వారు సామాన్యుల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి.. పేదల ఇండ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాన్లు కూడా తీసుకోవటానికి సమయం లేకుండా ఉన్నపళంగా కూల్చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
తాజాగా.. అమీన్ పూర్ మున్సిపాలిటిలోని పటేల్‌గూడలో పలు నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అయితే ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే గుండె తరుక్కుపోతోంది. ఒక్కొక్కరిది ఒక్కోగాథ. రిజిస్ట్రేషన్ అయిన మూడు రోజులకే తన ఇంటిని నేలమట్టం చేశారంటూ ఓ కుటుంబం కన్నీరు పెట్టుకుంటే.. గృహ ప్రవేశం చేసి మామిడాకుల తోరణాలు ఆరకముందే ఇంటిని కూల్చేశారని మరో బాధితుడు భావోద్వేగానికి గురయ్యాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నా ఎందుకు కూల్చారని ప్రశ్నిస్తున్నారు. వాళ్లే రిజిస్ట్రేషన్ చేస్తారు.. వాళ్లే కూల్చేస్తారు.. ఇదెక్కడి న్యాయమంటూ బాధితులు బోరుమంటున్నారు. అలా ఇల్లు కోల్పోయిన ఓ బాధితుడి ఆవేదన ఆయన మాటల్లోనే..
3 సంవత్సరాలు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కొన్నాం. మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ సిస్టం కరెక్ట్ కాదు. ప్రభుత్వ ల్యాండ్ అంటున్నారు.. అమ్మితే మేమే కొంటాం కదా.. కూల్చేస్తే ఏమెుస్తది. ఇది స్మశానంలా తయారయింది. ఆ తర్వాత రాష్ట్రానికి బడ్జెట్ లేదని మీరే అమ్మేస్తారు. అదేదో మేమే ఇస్తాం కదా. గవర్నమెంట్ వాళ్లే అన్ని పర్మిషన్లు ఇచ్చారు. గత మూడేళ్లుగా కష్టపడి కొనుక్కున్నాం. ఇంకా 70-80 లక్షల అప్పుంది. ఆ అప్పును ఎలా తీర్చాలి. గ్రామ పంచాయితీ నుంచి పర్మిషన్ తీసుకున్నాం. లోన్ కూడా వచ్చింది. అన్నీ బానే ఉన్నాయ్ కదా అని కొన్నాం. గత సోమవారమే గృహ ప్రవేశం అయింది. మామిడాకుల తోరణాలు కూడా ఆరలేదు. నివాస గృహాలు కూల్చొద్దని సీఎం రేవంత్ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో అలా లేదు.
మేం సామాన్యులం. 90 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొన్నాం. కూలగొట్టే బదులు వాళ్లే తీసుకొని మాకు అమ్మొచ్చు కదా. హైదరాబాద్‌లో ఇల్లు ఉండాలని పిచ్చి టార్గెట్‌తో ఇల్లు కొన్నాం. నాకు 52 ఏళ్లు. నా సంపాదన అంతా ఇందులోనే పోశా. ఇప్పుడు ఏం లేదు. క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు ఏ దారి కనిపించటం లేదు. మేం సాదాసీదా మనుషులం. డాక్యుమెంట్లు, పర్మిషన్లు చూసుకున్నాం. అన్నీ ఉన్నాయి కదా అని కొన్నాం. వాళ్లే రిజిస్ట్రేషన్ చేసి వాళ్లే కూల్చేస్తున్నరు. మాకు నష్టపరిహారం కావాలి. ఇది ఎవరి తప్పు. మేం కబ్జాలు చేయలేదు. అన్నీ సవ్యంగా ఉన్నాయి కదా అని కొన్నాం. ఈ మనోవేదన తట్టుకోలేకపోతున్నాం.’ అని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…