ఆక్రమణలకు పాల్పడ్డవారే హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు

By KTV Telugu On 7 October, 2024
image

KTV TELUGU :-

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలపట్ల పేద ప్రజలు ప్రతిపక్షాలు వ్యతిరేకత చూపిస్తున్నారు. కానీ దందాలు చేస్తున్న అక్రమార్కుల పట్ల హైడ్రా సింహ స్వప్నంగా మారింది. సామాన్యులు బుల్డోజర్ రాకముందే ఆక్రమిత స్థలాలు గోదాములు షెడ్లను ఖాళీ చేస్తున్నారు. ఆర్బిఎక్స్ మార్కింగ్ చేసిన ఇళ్లలోని సామాన్లను తీసుకుని తరలిపోతున్నారు. ఎలాగైనా కూల్చి వేతలు తప్పవు కనీసం సామాన్లు అయినా రక్షించుకుందం అని భావిస్తున్నారు.

ఇన్నాళ్లు కొందరు అక్రమార్కులు మట్టి పోసి ఆయా స్థలాలను తమ ఆధీనంలో ఉంచుకొని లీజు పేరుతో ఆదాయం పొందుతున్నారు . అక్రమార్కుల దందా క్రమేనా తగ్గుముఖం పడుతుంది. తీసుకున్న స్థలాల్లో లక్షలు వెచ్చించి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల డీలర్లు సర్వీసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఎంతో ఆధునికంగా నిర్మించుకున్న సర్వీసింగ్ సెంటర్లను సైతం తరలిస్తున్నారు

ఫణిగిరి కాలనీలోని బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని కూడా పూర్తిగా తొలగించారు ముసరాంబాగ్ బ్రిడ్జి తర్వాత దిల్షుక్నగర్ వైపు ఎడమ వైపు ఉన్న షెడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి

మూసి పరివాహక ప్రాంతం నగరంలో ప్రైమ్ ఏరియా దీనీ వెంట చిన్న స్థలం దొరికినా నివాసానికి గాని అక్రమ దందాకు గాని ఇష్టా రీతిగా వాడుకుంటున్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో లేఅవుట్లు అభివృద్ధి చేసిన కొందరు వ్యక్తులే ఆక్రమణలకు ఆజ్యం పోశారు. ఈ ప్రాంతంపై పట్టు ఉండడంతో రోజు నిర్మాణ వ్యర్థాలను పారపోస్తూ క్రమంగా మూసిని తమ అధీనంలోకి తీసుకున్నారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్ధాలు చాలావరకు మూసికే తరలించారు డంపింగ్ చేసేటందుకు నగరంలో ఎక్కడ చోటు లేదంటూ రాత్రి సమయాల్లో ఇష్టానుసారంగా వ్యర్థాలను డంపింగ్ చేశారు

ముసిని ఆక్రమించిన వారు ఆ స్థలం లో మేము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నాం కాబట్టి అది మాదేనని డబల్ బెడ్ రూమ్ ఇల్లే కాకుండా పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు
వ్యర్ధాలను పోసి చదును చేసి నివాస స్థలాలుగా మార్చారు ఆ స్థలాలను వాణిజ్యం వ్యాపారాలకు లీజుకు ఇచ్చారు. అడ్వాన్సుల కింద లక్షల రూపాయలను తీసుకోవడంతో ప్రతి నెల పెద్ద మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు ప్రధానంగా ఆటోమొబైల్ కంపెనీలు సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎం జి బి ఎస్ మెట్రో స్టేషన్ కు సమీపంలో మూసిలో ప్రైవేటు బస్సుల పార్కింగ్ ఏర్పాటు చేశారు ఉస్మానియా ఆసుపత్రి గేటు వరకు ఏకంగా మూసిలోనే పార్కింగ్ వ్యాపారం సాగుతోంది. ఇలాంటి వారే ఎక్కువగా వ్యతిరేకత చూపిస్తున్నారు. సామాన్య ప్రజలు కాదు అంటూ కొందరు చెప్తున్నారు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి