ఈరోజు కవితకు బెయిల్ వస్తుందంటూ ఆశగా ఎదురుచూస్తున్న వారందరికీ నిరాశే ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది.
సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు
. ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. స్పందన తెలియజేయాలని కేంద్ర ఏజెన్సీలను కోర్టు కోరింది. తదుపరి విచారణను ఆగస్టు 20కి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది.
బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కవిత సవాల్ చేశారు. మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక కవిత తరుఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలల నుంచి ఆమె జైల్లో ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించాయి. దీంతో ఆమె ఆశలన్నీ సుప్రీంకోర్టు పైనే పెట్టుకున్నారు. ఇవాళ తనకు బెయిల్ వస్తుందని ఆమె భావించినట్టు సమాచారం. . ఇక బెయిల్ కోసం మరో వారం పాటు కవిత వేచిచూాడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడైనా బెయిల్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి
తీహార్ జైల్లో ఉన్న కవితలు బయటకు తీసుకొచ్చేందుకు ఆమె కుటుంబం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరూ కవితకు బెయిల్ అంశంపై చర్చించారని. త్వరలోనే బెయిల్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కోర్టులో నిరాశే ఎదురైంది. మళ్లీ 20వ తేదీ వరకు వేచి చూడవలసిందే
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…