ఇది సీబీఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ – Kavitha Hot Comments On CBI

By KTV Telugu On 16 April, 2024
image

KTV TELUGU :-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ed అరెస్ట్ చేసి తీహార్ జైల్లో ఉంచగా , cbi కూడా కవితను అరెస్ట్ చేసి విచారించి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా మూడు రోజులు కస్టడీకి ఇవ్వడానికి సిబిఐ కి అనుమతినిచ్చింది కోర్ట్. అయితే కవిత సహకరించడం లేదని ఈ కేసులో కవితనే కీలక సూత్రధారి అని విజయ్ నాయర్ తో కలిసి ఆమె ప్రణాళికలు వేశారని దాని ప్రకారమే ఢిల్లీ, హైదరాబాద్ లో మీటింగ్ లు జరిగాయని ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఈ కుంభకోణం లో కవిత పాత్ర స్పష్టంగా తెలుస్తుంది అన్నారు.

కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సిబిఐ వాదనలను తప్పు పట్టారు కవిత అరెస్టు కుట్రపూరితమైనదని అన్నారు సెక్షన్ 41 ను సిబిఐ దుర్వినియోగం చేస్తుందని కవిత అరెస్టు కోసం ఎలాంటి కేసు లేదని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం . కవిత అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్లను కొట్టివేసి కవితను సిబిఐ కస్టడీకి అనుమతించింది

గడువు ముగియడం తో మళ్ళీ కవితను సీబీఐ అధికారులు రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
వాదనలు వినిపించిన సీబీఐ న్యాయవాదులు.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించలేదని.. కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యుడిషీయల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలిచ్చింది.

ఇక కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చే సమయంలో కవిత మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణపై కీలక కామెంట్స్ చేశారు. ఇది సీబీఐ కస్టడీ కాదని.. బీజేపీ కస్టడీ అని తీవ్ర విమర్శలు చేశారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారన్నారు. ఆడిగిందే అడుగుతున్నారని.. గత 2 సంవత్సరాల నుంచి అదే విషయాన్ని అడుగుతున్నారన్నారు. విచారణలో కొత్తగా అడిగేది ఏం లేదని కవిత వ్యాఖ్యానించారు.అయితే కవిత మీడియాతో మాట్లాడకూడదని న్యాయమూర్తి సున్నితంగా మందలించినట్లు సమాచారం

సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆమె సోదరుడు కేటీఆర్‌ ఆదివారం కలిశారు. కవిత భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్‌తో కలిసి ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌.. కవితను కలిసి దాదాపు రెండు గంటలు మాట్లాడి . సీబీఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, ఏయే అంశాలపై విచారణ,, తిహార్ జైలులో పరిస్థితి, సీబీఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది ? కేసు విచారణలో ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్‌ పిటిషన్‌ తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
బెయిల్‌ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్‌ ధైర్యం చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి