బతుకమ్మ పండుగ వచ్చిందంటే కవిత చేసే హడావుడి మామూలుగా ఉండేది కాదు. తెలంగాణ జాగృతి తరఫున ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో బతుకమ్మ ఆట నిర్వహిస్తూ మధ్యలో విదేశాలకు కూడా వెళ్తూ సగౌరవంగా బతుకమ్మ ఎత్తుకొని ఆటపాటలు ఆడేది. ప్రస్తుతం బతుకమ్మ సంబరాలు ముగిస్తాయి అయినా కవిత జాడ ఎక్కడా లేదు.
తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేసిన కాలంలో కవిత ఏర్పాటుచేసిన తెలంగాణ జాగృతి తరఫున బతుకమ్మ ఆటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది
కవిత అభిమానులు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కవితక్క అంటారు
బతుకమ్మకు పూర్వ వైభవం వచ్చింది అంటే అది కవిత వల్లనే అయింది అంటారు
కారణాలు ఏవైతే నేమి ఒక దశ లో చాలామంది బతుకమ్మ ఆడడం మానేశారు. ఇక ఈ ఆట మా తోనే కనుమరుగవుతుందేమో అనుకున్న ముందు తరం వారు కూడా ఉన్నారు అయితే కవిత బతుకమ్మ ప్రభావం పెరగడానికి చాలా కృషి చేసింది అని అంటారు. రాజకీయంగా బతుకమ్మను పార్టీ ఎలా వాడుకున్నారు అన్న విషయం పక్కన పెడితే టిఆర్ఎస్ పార్టీ బతుకమ్మకు పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేయడం ప్రజల్ని ఉత్సాహపరచడం వల్ల అక్కడక్కడ మాత్రమే ఆడే బతుకమ్మ ఆట నేడు చాలా ప్రాంతాల్లో కనబడుతుంది.
ఒకప్పుడు బతుకమ్మ నా అదేంటి అని వినడానికి కూడా ఉత్సాహం చూపని వారు , నేడు చాలా ఉత్సాహంగా బతుకమ్మ ఎలా ఆడతారు ఏమి నైవేద్యాలు సమర్పిస్తారు అని ఆసక్తిగా అడిగి బతుకమ్మ ఆడుతున్నారు, అమ్మవారిని కొలుస్తున్నారు . తెలంగాణ వారే కాకుండా తెలంగానేతరులు కూడా బతుకమ్మ ఉత్సవంలో పాల్గొంటున్నారు..
కవిత అభిమానులు కవితక్క బతుకమ్మ పండుగకు బయటకు వస్తది అని ఎదురు చూశారు, కానీ కవిత ఎక్కడా కనపడలేదు.
కెసిఆర్ ఏ కవితను బయటకు రావద్దని చెప్పారని ఆమె బయటికి వస్తే బిజెపి కాంగ్రెస్ విమర్శనాస్రాలతో సిద్ధంగా ఉన్నారని చెప్పినట్టు సమాచారం
మరోవైపు కొందరు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా వాపోతున్నారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…