రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. రక రకాల నమ్మకాలు ఉంటాయి. శకునాల దగ్గర్నుంచి సంఖ్యల వరకు అన్నీ సెంటిమెంట్లే. ఇపుడిలాంటి ఓ సెంటిమెంటే రాజకీయ వర్గాల్లో తెగ చర్చకు దారి తీస్తోంది.అదే డబుల్ ట్రబుల్. ఒక నాయకుడు రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయడం ఎన్నికల రాజకీయాల్లో కొత్త కాదు. ప్రత్యేకించి పార్టీల అధ్యక్షులు రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇలా పార్టీ అధినేతే రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేస్తే ఏమవుతుంది? అలా చేసిన పార్టీకి కష్టాలు తప్పవా? గత చరిత్ర ఏం చెబుతోంది? ఇది తెలియాలంటే ఓ సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోటా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ ఒకేసారి 115 మంది అభ్యర్ధులతో జుంబో లిస్ట్ విడుదల చేసిన బి.ఆర్.ఎస్. అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయ వర్గాలకు కావల్సినంత మేత పెట్టారు. రాష్ట్రంలో అంతా ఈ జాబితా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో అందర్నీ ఆకర్షిస్తోంది మరోటి ఉంది. అదే పార్టీ అధినేత కేసీయార్ పోటీచేయబోయే నియోజక వర్గాల అంశం. ఈ ఎన్నికల్లో కేసీయార్ రెండు నియోజక వర్గాల నుండి పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వెల్ నియోజక వర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజక వర్గం నుండి కూడా కేసీయార్ బరిలో దిగనున్నారు.
కేసీయార్ రెండు నియోజక వర్గాల నుండి పోటీచేయడానికి అసలు కారణం ఆయనకు ఓటమి భయం పట్టుకోవడమే అంటున్నారు కాంగ్రెస్, బిజెపి నేతలు. ఒక నియోజక వర్గంనుంచే పోటీ చేస్తే అక్కడ ఓడిపోతే అసలు అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదన్న భయంతోనే కేసీయార్ రెండు నియోజక వర్గాలను ఎంచుకున్నారన్నది వారి వాదన.ఇలా రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయడం ద్వారా కేసీయార్ ముందస్తుగానే బి.ఆర్.ఎస్. ఓటమిని ఒప్పుకున్నట్లయ్యిందని బిజెపి అంటోంది.
పార్టీ అధ్యక్షుడు రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయడం కొత్త కాదంటున్నారు రాజకీయ పండితులు. గతంలో చాలా మంది ఇలా రెండు నియోజక వర్గాల నుండి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. కాకపోతే పార్టీ అధ్యక్షులు రెండు చోట్ల నుండి పోటీ చేసిన సందర్భాల్లో వారి పార్టీలు అధికారంలోకి రాలేదని పొలిటికల్ సెంటిమెంటలిస్టులు అంటున్నారు. దానికి సంబంధించి వారు చాలా ఆధారాలు కూడా చూపుతున్నారు. టిడిపి వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, ప్రజారాజ్యం పార్టీ అధినేత సినీ నటుడు చిరంజీవి.. జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుండి పోటీ చేయగా ఆయన ఓడిపోయారు.
1983లో టిడిపిని స్థాపించిన ఎన్టీయార్ మొదటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తొలి ఎన్నికల్లోనే ఆయన రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. ఒకటి గుడివాడ కాగా రెండో నియోజక వర్గం తిరుపతి. ఆ ఎన్నికల్లో ఆయన ప్రభంజనానికి ఎదురు లేకపోవడంతో రెండు చోట్లా గెలిచారు. 1989 ఎన్నికల్లో ఎన్టీయార్ మరోసారి రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేశారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజక వర్గం నుండి పోటీచేశారు. ఈ ఎన్నికల్లో హిందూపురం నుండి గెలిచిన ఎన్టీయార్ కల్వకుర్తిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి చెందారు.
2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. తన స్వగ్రామం అయిన మొగల్తూరు ఉన్న పాలకొల్లు అసెంబ్లీ నియోజక వర్గంతో పాటు తిరుపతి నుండి కూడా పోటీ చేశారు. అయితే పాలకొల్లులో చిరంజీవి ఓటమి చెందారు. తిరుపతిలో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న ఆయన కల నెరవేరలేదు. చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2019లో భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓటమి చెందారు. మరి ఇపుడు రానున్న ఎన్నికల్లో కేసీయార్ రెండు చోట్లా గెలిచి ఎన్టీయార్ లా అధికారాన్ని చేజిక్కించుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…