రికార్డు స్థాయిలో ఖైరతాబాద్ గణేశుడి హుండీ ఆదాయం..

By KTV Telugu On 19 September, 2024
image

KTV TELUGU :-

హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడే. ఇక్కడ మహా గణపతి కొలువై ఉన్నాడు. ఆయన్ను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో హుండి ఆదాయం భారీగా వచ్చి చేరింది.

దేశ వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒక ఎత్తైతే.. హైదరాబాద్ నగరంలో మరో ఎత్తు. అందులోనూ ఖైరతాబాద్ వినాయకుడు మరింత ఫేమస్. గత 70 సంవత్సరాలుగా ఖైరతాబాద్‌లో భారీ గణేశ విగ్రహాన్ని ఏర్పాట్లు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సారి కూడా 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తుతో సప్త ముఖ గణేషుని ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ నిర్వాహకులు. మట్టితోనే నిర్మించిన విగ్రహాన్ని చూసి తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చి తిలకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా గణపతిని చూసి మురిసిపోయారు..

భారీ గణనాథుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చి పెద్ద యెత్తున కానుకలు సమర్పించారు. దీంతో భారీ ఎత్తున హుండీకి ఆదాయం వచ్చింది. తొలిసారిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కొత్త కార్యవర్గ సభ్యులు ఈ ప్రక్రియ నిర్వహించడం ద్వారా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహా గణపతికి రూ. 70 లక్షల ఆదాయం వచ్చింది. అంతే కాకుండా హోర్డింగ్స్, ఇతర సంస్థల ప్రకటన ద్వారా మరో రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది. అంటే మొత్తంగా కోటి పది లక్షల రూపాయల ఆదాయం చేకూరింది. ఈ 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా పెద్ద సంఖ్యలో ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. ఈ పది రోజుల్లో నగదు రూపంలో ఇంత సమకూరినట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.

అలాగే స్కానర్స్, ఆన్ లైన్ ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ఇంకా లెక్కించాల్సి ఉందని సమాచారం. 70 ఏళ్ళ నుంచి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో వినాయకుడి పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. 1954లో పెట్టిన ఒక్క అడుగు గణపతి కాస్త.. ఏటా ఏటా పెరుగుతూ నేడు 70 అడుగులకు చేరుకుంది. 70వ వసంతలోకి ఉత్సవాలు రావడంతో భారీ వినాయకుడు ఏర్పాటుతో మహా గణపతిని చూసేందుకు భారీగా భక్త జనం తరలి వచ్చారు. భక్తి, శ్రద్దలతో కొలిచారు. ఆయనకు ఇష్టమైన ప్రసాదాలు అందించి మురిసిపోయారు. దీంతో ఎన్నడూ లేని విధంగా జన సందోహం నెలకొంది. మొత్తానికి 11 రోజుల పాటు విశేషమైన పూజలు అందుకున్న మట్టి మహా గణపయ్య.. నిమజ్జనానికి తరలి వెళ్లారు. ఆయనను తిలకించేందుకు వేలాది మంది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని బైబై గణేశా అంటూ గుడ్ బై చెప్పారు. చిన్నా, పెద్ద అంతా సందడి చేశారు. మరుసటి ఏడాది మరో గణపయ్యతో కలుద్దాం అంటూ వీడ్కోలు పలికారు. భారీ మొత్తంలో ఆదాయం రావడంపై మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి