మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఓటమి
కాంగ్రెస్‌లో వెంకటరెడ్డికి సంకట పరిస్థితి
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమితో కోమటిరెడ్డి రాజగోపాల్ పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఈ ఉప ఎన్నిక ఫలితం ఆయన సోదరుడు కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి కూడా కంకటంలో పడిపోయింది. కాంగ్రెస్ ఎంపి అయి ఉండి కూడా తన పార్టీ ని గెలపించమని ఆయన ప్రచారం చేయలేదు. ఎందుకంటే అవతలివైపు బీజేపీ తరపున పోటీలో ఉన్నది స్వయానా తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ప్రచారానికి రండి అన్నయ్యా అని కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేసినా వెంకటరెడ్డి వెళ్లలేదు. తాను ప్రచారం చేసినా చేయకున్నా కాంగ్రెస్ పార్టీ గెలవదు అని తన మనసులో మాట చెప్పారు. అయినా తనలాంటి హోమ్‌గార్డులు ప్రచారం చేస్తే ఏం లాభం. ఎస్పీ వెళ్లి పార్టీని గెలిపించాలని పరోక్షంగా రేవంత్‌రెడ్డి మీద సెటైర్లు వేశారు. తాను ఇక్కడే ఉంటే ప్రచారానికి రమ్మనమని ఒత్తిడి చేస్తారని ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిపోయారు.
ఈలోగా తన తమ్ముడిని గెలింపించాలని కాంగ్రెస్ నాయకుడితో మాట్లాడిన ఆడియో లీకయ్యింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వెంకటరెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులే ఆయన తీరును తప్పు పట్టారు. తీరా చూస్తే ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన తన తమ్ముడు ఓడిపోయారు. ఇటు చూస్తేనేమో పార్టీలో తనపట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం వెంకటరెడ్డికి రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వాటికి ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నెగ్గి ఉంటే వెంకట్ రెడ్డి కూడా మరో ఆలోచన లేకుండా బీజేపీలో చేరేవారేమో తెలియదు. ఇప్పుడు తమ్ముడు ఓడిపోవడంతో ఈయన పరిస్థితి డోలాయమానంలో పడిపోయింది. రేపటినుంచి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీలో ఏం విలువు ఉంటుందో తెలియదు. కాంగ్రెస్‌లో అయితే ఇప్పటికే వెంకటరెడ్డి కి శత్రువులు ఎక్కువైపోయారు. ఆయన మాటకు విలులే ఉండదు. మొత్తానికి వ్రతం చెడినా ఫలితం దక్కనట్లు అయిపోయింది ఆయన పరిస్థితి.