కృష్ణ.. కృష్ణార్పణం !

By KTV Telugu On 9 February, 2024
image

KTV TELUGU :-

కృష్ణా ప్రాజెక్టుల్ని  కేంద్రానికి సరెండర్ చేశారని ఇది తెలంగాణకు ద్రోహం చేయడమేనని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కువపెట్టింది. రివర్స్ లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణకు చేసిన అన్యాయాన్ని తెరపైకి తీసుకు వస్తోంది.  దీంతో  ప్రాంతాల వారీగా వివక్ష పేరిట రాజకీయాలు మళ్లీ తెలంగాణలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్ని కేంద్రానికి అప్పగించే అంశంపై ప్రారంభమైన వివాదం తిరిగి తిరిగి ప్రాంతాల వారీగా ప్రాజెక్టులపై చేసిన నిర్లక్ష్యం గురించి చర్చకు దారి తీస్తున్నట్లుగాకనిపిస్తోంది.

కృష్ణా న‌దీ జ‌లాల వివాదం, యాజ‌మాన్య నిర్వ‌హ‌ణ అంశంంలో కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు.   అసెంబ్లీ స‌మావేశాల్లో కాంగ్రెస్ పార్టీపై గ‌ట్టిగా కౌంట‌ర్ అటాక్ చేయాల‌ని బీఆఅర్ఎస్ నిర్ణ‌యించింది కృష్ణా జలాలు, కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే ల‌క్ష్యంగా కేసీఆర్   ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ సభ నిర్వహించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు గా తెలుస్తోంది  అసెంబ్లీ స‌మావేశాల త‌రువాత‌ రెండు ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌తో ఈ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెబుతున్నరాు.  ద‌క్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మ‌డి హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్ల‌ల నేత‌లను ఈ  పోరాటంలో భాగం చేయనున్నారు.

ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తే తాగడానికి కూడా నీరు ఉండని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే అసలు బీఆర్ఎస్ విభజనచట్టం కింద ఎప్పుడో ప్రాజెక్టుల్ని  కేంద్రానికి అప్పగించిందని.. కాంగ్రెస్ పత్రాలు చూపించింది. నీటి పంపకాల్లో వాటాలకు అనుమతించి సంతకాలు కూడా చేశారని చెబుతున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రోజున ఏపీ సర్కార్ సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకున్న  విధానంతో.. కేంద్రం మరోసారి అలాంటి వివాదాలు రాకండా నిర్వహణను తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించడంతో మరో చాయిస్ లేకుండా పోయింది.  పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయాల్సిన తప్పులన్నీ చేసి తమపై నిందలు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. పదవి చేపట్టినప్పటి నుండి సంయమనంతో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో బీఆర్ఎస్ విమర్శల్ని మాత్రం తేలికగా తీసుకోలేకపోయారు. ఘాటుభాషతో విరుచుకుపడ్డారు. ఇదో కొత్త వివాదానికి దారి తీసింది. అదే సమయంలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేసీఆర్ చేసిన అన్యాయం అంటూ  విస్తృతంగా చేస్తున్నారు. నిజానికి  పదేళ్ల కాలంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

పూర్తిగా కాళేశ్వరం కోసమే ఖర్చు పెట్టారని.. కానీ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల్ని పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించాల్సిన  ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఎప్పుడో  పూర్తి కావాల్సి ఉంది. కానీ  ఇంకా ప్రారంభం కాలేదు. దక్షిణ తెలంగాణ కరువు తీర్చేస్తుందని ఆశపడ్డ  పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఎన్నికలకు  ముందు కేసీఆర్ ఓ మోటార్ ఆన్ చేశారు. కానీ  ప్రాజెక్టు ఇంకా నలభై శాతం కూడా పూర్తి కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే పది లక్షల ఎకరాలకు నీరు అందేదని  చెబుతున్నారు.   శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పని రాష్ట్ర పునర్విభజన నాటికి 30 కి.మీ. పూర్తయింది. పది కి.మీ. పెండింగ్‌లో ఉండగా.. గత పదేళ్లలో ఒక కి.మీ. మాత్రమే పూర్తి చేశారు. ఇది పూర్తయితే మూడున్నర లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందుతాయి. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా పనులు చేయలేదని ప్రజల ముందుకు తీసుకెళ్తోంది.    డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఒకే దగ్గరి నుంచి నీటిని తరలించే విధంగా ప్రాజెక్టులను పూర్తిచేస్తే నల్లగొండ, పాలమూరు జిల్లాల మధ్య పోరాటాలు జరుగుతాయన్న ఆందోళన ఉందంటున్నారు. బీఆర్ఎస్ తరపున దక్షిణ తెలంగాణ నేతల   చేతగాని తనం వల్లే దక్షిణ తెలంగాణకు, పాత మహబూబ్‌నగర్‌ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కారణం ఏదైనా ఉత్తర తెలంగాణకు వర ప్రదాయనిగా చెబుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపైనే తెలంగాణ ప్రభుత్వం పదేళ్ల పాటు దృష్టి పెట్టింది. దాదాపుగా రూ. లక్ష కోట్లు ఆ ఒక్క ప్రాజెక్టుపైనే పెట్టారు. కానీ ఆ ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు సరైన  విధంగా నిధులు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి విమర్శించడానికి ఎక్కువ అవకాశం లభిస్తోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కృష్ణా జలాలు, ప్రాజెక్టులు, తెలంగాణకు  జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగనుంది. ఆ చర్చ జావుగా సాగితే ప్రజలే .. ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి