క్యాడర్‌పై కేసుల వల – కేటీఆర్ పుణ్యమే !

By KTV Telugu On 27 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాలు  ఫీల్డ్ లో కన్నా ఆన్  లైన్లోనే అసలు రాజకీయం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో లీడర్లు అంతా రిలాక్స్ అయ్యారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై వరుసగా కేసులు నమోదుతున్నాయి. పేక్ ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేయడం ,కేసులు పెట్టడం కామన్ గా మారిపోయింది. ఇలా కేసులు పెట్టడం ఏమిటని .. అలాంటి కేసులు పెట్టాల్సి వస్తే ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి మీదనే పెట్టాల్సి వస్తుందని కేటీఆర్ ఆవేశంగా స్పందిస్తున్నారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేమని న్యాయపరమైన పోరాటాలు తప్ప.. మరో ఆప్షన్ ఉండదని కేటీఆర్ కూడా తెలుసు. కానీ ఈ పరిస్థితి వల్ల ఎక్కువగా బీఆర్ఎస్ క్యాడర్ కేసుల పాలవుతోంది.

తెలంగాణ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది బీఆర్ఎస్  లక్ష్యం. అయితే ఇది సోషల్ మీడియా పోస్టుల ద్వారానే సాధ్యమవుతుందన్నట్లుగా విశ్వరూపం చూపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డితో ముడి పెట్టడం.. తెలంగాణకు ఏదో అయిపోయిదన్నట్లుగా ప్రచారం చేస్తూండటం ఎబ్బెట్టుగా మారింది.  బీఆర్ఎస్ ప్రజలు కనీస అవసరాలకు నోచుకోవడం లేదని బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల తీవ్ర దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారని వారిని గట్టున పడేయాలంటే మళ్లీ అర్జంట్‌గా బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇందు కోసం ఎక్కువగా ఫేక్ పోస్టులపైనే ఆధారపడుతున్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో కరెంట్ పోయిందని.. ఇదేంపాలన అని విమర్శిస్తూ ఓ సోషల్ మీడియా కార్యకర్త పోస్టులు వైరల్ చేశారు. దానికో వీడియో ఎటాచ్ చేశారు. ఆ వీడియో సోర్స్ చూస్తే ఏడేళ్ల కిందటిదని తేలింది. దీంతో ఉస్మానియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆర్టీసీ లోగో విషయంలోనూ అదే చేశారు. అధికారికం కాని లోగోను క్రియేట్ చేయడమే కాకుండా …తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొచ్టేలా.. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయాలన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు పోస్టులు వైరల్ చేశారు. నిజానికి పేరు మార్పే కానీ లోగో ఇంకా ఫైనల్ చేయలేదని ఆర్టీసీ ఎండీ ప్రకటించాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇవి గత రెండు, మూడు రోజుల్లో జరిగినవి. గతంలో ఉస్మానియా యూనివర్శిటీ ఫేక్ సర్క్యూలర్ కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జైలుకు కూడా వెళ్లారు. అయినా బీఆర్ఎస్ వైపు నుంచి ఫేక్ పోస్టులు మాత్రం ఆగడం లేదు. ప్రతీ అంశాన్ని ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ముడిపెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎక్కువగా ఉంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నాయి. పవర్ చేతిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటిని  సహిస్తే.. ఇంకా ఎక్కువగా బట్ట కాల్చి మీద వేస్తారని కేసులు పెట్టుుకంటూ పోతోంది.

అయితే ఈ విషయంలో కేటీఆర్ కాంగ్రెస్ పై ఎదురుదాడి చేస్తున్నారు. గతంలో మీరు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ఒక సిగ్గులేని అబద్ధాన్ని క్రియేట్ చేశారు. నా బంధువుకు రూ.10 వేల కోట్ల కొవిడ్ డ్రగ్ కాంట్రాక్టు ప్రభుత్వం నుంచి వచ్చిందని ప్రచారం చేశారు. ఇదే సేమ్ జోకర్ మరో ఫేక్ కథనం క్రియేట్ చేశారు. తెలంగాణ సచివాలయం కింద ఉన్న నిజాం నిధులను కాజేయడం కోసం ఆ భవనాల్ని కూల్చేస్తున్నామని ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రి ఫేక్ వీడియోని వైరల్ చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిందంటూ ఒక ఫేక్ సర్క్యులర్ ను పోస్ట్ చేశారు. ఇలాంటి నకిలీ వార్తల్ని ప్రచారం చేసే వ్యక్తిని ఎందుకు జైల్లో పెట్టరు అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. నిజానికి  ఫేక్ ప్రచారాలు చేశారని.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారని  రేవంత్ రెడ్డిని పలుమార్లు అరెస్టు చేశారు కూడా జన్వాడ ఫామ్ హౌస్ వివరాలుబయట పెట్టినప్పుడు అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో ఉంచారు. అయితే రాజకీయ ఆరోపణలు చేయడానికి ప్రభుత్వంపై ఫేక్ న్యూస్ లతో విరుచకుపడటానికి చాలా తేడా ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా నాలుగున్నరేళ్ల గడువు ఉంది.  అద్భుతం జరిగితే తప్ప కాంగ్రెస్ సర్కార్ కు వచ్చిన నష్టం లేదు. బీఆర్ఎస్ కూడా ఇప్పటికిప్పుడు చేయగలిగిందేమీ లేదు.   కాంగ్రెస్ పై ఇన్‌స్టంట్‌గా ప్రజా వ్యతిరేకత పెంచాలన్న తాపత్రాయన్ని మానుకుని కాంగ్రెస్ పార్టీ కి కొంత సమయం ఇచ్చి.. ఆ తర్వాత పోరాటం చేస్తే.. ప్రజలకు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంపై పోరాటం పేరుతో  ఫేక్ ప్రచారంతో విరుచుకుపడితే క్యాడర్ కేసుల్లో ఇరుక్కోవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉందన్న అభిప్రాయం ఉంది.   ప్రతిపక్ష పార్టీగా నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తారా.. లేకపోతే ఇలా ఫేక్ న్యూస్ తో రాజకీయం చేస్తారా అన్నదానిపైనే ఆ పార్టీ గమనం ఆధారపడి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయం.

ఫేక్ న్యూస్ తాత్కలికంగా మాత్రమే లాభం చేస్తుంది. దీర్ఘ కాలంలో నష్టం చేస్తుంది. బీఆర్ఎస్ వ్యూహకర్తలు దీన్ని అర్థం చేసుకుంటే క్యాడర్ కేసుల పాలు కాకుండా కాపాడుకోగలరు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి