మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చంద్రబాబు నాయుడుని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో కలిశారు. మల్లారెడ్డితో పాటు సీఎం చంద్రబాబును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి. కలిసి మాట్లాడారు. మర్యాద పూర్వకంగా చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుతో చర్చించారు. తిరుమల దర్శనం కోసం తెలంగాణ నుంచి వచ్చే లెటర్స్ అనుమతించాలని చంద్రబాబును నేతలు కోరారు.
చంద్రబాబుతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభం తీసుకువస్తామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు అని ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందాయని తీగల కృష్ణారెడ్డి కొనియాడారు.
. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చేరే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తన ముఖ్య అనుచరులతో గతంలో మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీలో చేరే విషయంపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. 2014 వరకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీలో ఎంపీగానూ పనిచేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో బీఆర్ఎస్లో చేరి మంత్రిగా పనిచేశారు. అయితే మరోసారి మల్లారెడ్డి టీడీపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబును మల్లారెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో
ఓడిపోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా టీడీపీ లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో హల్చల్ చేస్తుంది.
తనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దాడులు తగ్గాలంటే అధికారంలో ఉన్న పార్టీలో చేరుతానని తన అనుచరులతో మల్లారెడ్డి చెబుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో మల్లారెడ్డి ఈ పదవీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబుతో ఉన్న పరిచయం తో ఆయన టీటీడీపీలోకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పటి నుండి మల్లారెడ్డి అధికారపక్షంలోకి మారిపోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి . కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుండి బయటకు రారని మరికొందరు అంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…