బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకున్నారు
మురుగుతో నిండిపోయి అసలు నీళ్లే లేని 35 చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు అనే విషయాన్ని మన హైడ్రా అధికారులు బెంగళూరుకు వెళ్లి పరిశీలించనున్నారు
మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. గురువారం ఆయనతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. బెంగళూరులో స్వల్ప ఖర్చుతో 35 చెరువులను బాగు చేసిన తీరును ఆనంద్ పవర్ పాయింట్ ద్వారా వివరించారు. పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి స్వచ్ఛమైన నీరు చేరే ఏర్పాట్లు, మురుగు కాల్వల నుంచే శుద్ధి చేసే ప్రక్రియను ప్రారంభించి.. చెరువులోకి చేరే వరకు మూడు, నాలుగు దశల్లో నీరు ఉంచి శుద్ధి చేసిన తీరుపై హైడ్రా దృష్టిసారిస్తోందని రంగనాథ్ తెలిపారు.
మురుగు కాల్వలకు ఇరువైపులా మొక్కలు నాటడం, చెరువుకు చేరేలోపే కొంత శుద్ధి అయ్యేలా చేయడంపై అధ్యయనం చేస్తామన్నారు. ఆనంద్ మల్లిగవాడ్ను హైదరాబాద్కు పిలిపించి ఇక్కడ చెరువుల పునరుద్ధరణపై సహాయ సహకారాలను కోరుతామని కమిషనర్ తెలిపారు. సున్నం చెరువు, అప్పాచెరువు, ప్రగతినగర్ ఎర్రకుంట, కూకట్పల్లి చెరువుల్లో కూల్చివేతల వ్యర్థాలను తొలగిస్తామన్నారు. చెరువుల పరిసరాల్లో నివిసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి పునరుద్ధరిస్తామన్నారు.
హైడ్రా ప్రధాన లక్ష్యం చెరువులు కుంటలను కాపాడి ఉపద్రవాలు రాకుండా చూడడమే అని తెలిపారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…