తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషడంనెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డ్ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందారు. బీటెక్ చదివిన లాస్య నందిత 2016 జిహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2021లో మరొకసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో కవాడిగూడ కార్పొరేటర్ గా పోటీ చేసి,ఓటమిపాలయ్యారు. గత ఏడది ఫిబ్రవరి 19న కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్య కారణంతో మరణించారు. దీంతో 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ లస్య నందితకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో దాదాపు 17వేల ఓట్ల పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించారు లాస్య నందిత. ఎమ్మెల్యేగా ఎన్నికైన మూడు నెలల లోపే ఆవిడ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న తరుణంలో ఆవిడ దుర్మరణం చెందారు. గత ఏడాది ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే, ఆయన కూతురు లాస్య 2024 ఫిబ్రవరి 23న చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా లాస్యనంత విజయం సాధించినప్పటి నుంచి ఆమెను ప్రమాదాలు వెంటాడుతున్నాయని చెప్పాలి. 13న నల్గొండలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఆ సభకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్పల్లి వద్ద ఓ వాహనం ఢీకొంది. దీంతో లాస్య వెళుతున్న కారు ముందు టైర్ ఊడిపోయింది .అదే తరుణంలో లాస్య నందిత కారులోనే ఉండటంతో తలకు స్వల్ప గాయమైంది. అంతకుముందు,కింద తే
టేడాది డిసెంబర్లో,ఆమె ఓ లిఫ్ట్ లో మూడు గంటల పాటు ఇరుక్కుపోయారు.సిబ్బంది లిఫ్ట్ డోర్ ను బద్దలు కొట్టి లాస్య నందితను బయటకు తీశారు. లాస్య నందితకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు నమ్రతా నివేదిత. లాస్య కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేశారు. తండ్రి మరణంతో లస్యకు టిఆర్ఎస్ సీట్ ఇవ్వగా, సమీప బీజేపీ అభ్యర్థి పై 17 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఏడాదిలోపే ప్రజాప్రతినిధులైన ఈ ఇద్దరు తండ్రీ కూతుర్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి నిపుణులు ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతి సుజుకి ఎక్సెల్ సిక్స్ కారులో వేగంగా ప్రయాణం ఒక కారణం, వెనుక సీట్లో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ముందు సీటుకు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ గా పార్ట్స్ డామేజ్ కావడం మరో కారణం అయితే, పది రోజుల క్రితం ఆమె స్కార్పియో లో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు అది రిపేర్ కి ఇవ్వడంతో ఎక్సెల్ సిక్స్ కార్లో ప్రయాణించారు. ఈ ప్రమాదం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బాసర గుడికి వెళ్ళి తిరుగు ప్రయాణం లో జరిగింది.ప్రమాద సమయంలో లో లాస్య నందిత మరియు డ్రైవర్ ఇద్దరు కార్లో ఉన్నారు.ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ ఆకాష్ కు తీర్పు గాయలవడం తో మియాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేసి చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…