ఈ నెల 19న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోది

By KTV Telugu On 8 January, 2023
image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఈ రైలును నాలుగు గంటల్లోనే చేరుకుంటుంది. వందేభారత్ ప్రయాణ వేళలకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటక రానుంది. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వందేభారత్ రైలు ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ నెల 19న ప్రధాని కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. వందేభారత్ రైలుతో పాటు సికింద్రాబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. వందేభారత్‌ రైలుతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ కు ప్రయాణ సమయం నాలుగు గంటలుగా ఉండే అవకాశం ఉంది. వందేభారత్ ను మొదట సికింద్రాబాద్ – విజయవాడ మధ్య నడుపుతారు. ఆ తరువాత విశాఖ వరకు పొడిగిస్తారు. మొదట వందేభారత్ రైలును విశాఖ వరకు నడపాలని ప్రతిపాదించారు. అయితే ట్రాక్ సామర్ధ్యం ఇప్పటికే కొనసాగుతున్న రైళ్లు రద్దీని పరిగణలోకి తీసుకొని ముందుగా విజయవాడ వరకు నడపాలని డిసైడ్ అయ్యారు. ఆ తరువాత విశాఖ వరకు పొడిగిస్తారు. వందేభారత్‌ తో ప్రయాణ సమయం ఆదా కానుండడంతో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.