పాలమూరు లో ఎక్కడ తేడా జరిగింది?

By KTV Telugu On 21 June, 2024
image

KTV TELUGU :-

ఓ నాడు  ఆ జిల్లాలో జైత్రయాత్ర కొనసాగించిన  ఆ పార్టీ ఇప్పుడు చతికిల పడింది.అటు అసెంబ్లీ..ఇటు లోక్‌సభ ఎన్నికల్లో వెనుకబడి పోయింది.ఎన్నికలు ఏవైనా విజయం తమదేనన్న ధీమాతో ఉన్న ఆపార్టీకి రెండు ఫలితాలు నిరాశను నింపగా..స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించటం ఊరట నిచ్చింది.అయితే ఆ జిల్లాలో పార్టీ ఈ స్దితికి దిగజారటానికి కారణం ఏంటి ?వాచ్‌ ది స్టోరీ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ వరుస విజయాలు సాధించింది.ఎన్నికలు ఏవైనా గెలుపు తమదేనన్న ధీమాతో ఉండేది.కాని ఇటీవల జరిగిన అసెంబ్లీ,లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందటం ఆపార్టీ నేతలు,కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు.ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ నుంచి 2009లో కేసీఆర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్దానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.అప్పటి నుంచి ఆ పార్టీ జిల్లాలో పట్టు సాధించింది.2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 14 స్దానాల్లాలో ఏడుస్దానాలు, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్దానంలో విజయం సాధించింది.తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్దానాల్లో 13 స్దానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు.

ఒక్క కొల్లాపూర్‌లో కాంగ్రేస్ నుంచి భీరం హర్షవర్దన్‌రెడ్డి గెలువగా ఆయన కూడ తర్వాత గులాభి గూటికి చేరారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్,మహబూబ్‌నగర్ స్దానాలు బీఆర్ఎస్ దక్కించుకుంది.అనంతరం జరిగిన రెండు స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల్లో,అయిదు జిల్లా చైర్మన్ పీఠాలను,ఒకటి తప్పా అన్ని మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది.ఇక స్దానిక సంస్ధల్లో కూడ విజయం సొంతం చేసుకుని గట్టిపట్టు సాధించింది.తమకు ఇక తిరుగేలేదని భావించిన ఆ పార్టీకి అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికలు షాకిచ్చాయి.

ఉమ్మడి జిల్లాలోని 14 స్దానాల్లో కేవలం అలంపూర్,గద్వాల స్దానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు విజయం సాధించారు.మిగిలిన స్దానాలు అన్ని కాంగ్రేస్ పార్టీ కైవసం చేసుకుంది.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రెండుస్దానాల్లో ఆ పార్టీ అభ్యర్దులు పరాజయం పాలయ్యారు.మూడవ స్దానానికే పరిమితమయ్యారు.దీంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. అయితే స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆపార్టీ అభ్యర్ది నవీన్‌కుమార్ రెడ్డి విజయం సాధించటంతో కొంత ఊరట చెందారు.

ఇంతగా పార్టీ పరాజయం పొందటానికి నేతల మద్య సమన్వయ లోపం..తమకేంటిలే అనే ఆహంకారమై కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బీఆర్ఎస్ నుంచి జూపల్లి కృష్ణారావు,సిట్టింగ్ ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి,కూచుకుళ్ల దామోధర్‌రెడ్డి,సిట్టింగ్ ఎంపీ రాములు,మాజీ ఎంపీ మందా జగన్నాథం,మేఘారెడ్డి వంటి నేతలు పార్టీలు వీడినా పెద్దగా పట్టించుకోక పోవటం కొంపముంచింది. సంస్దాగతంగా  బలంగా  ఉన్నా  బీఆర్ఎస్ వరుస పరాజయాలు మూటగట్టుకోవటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరాశతో ఉన్న పార్టీ క్యాడర్‌కు పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్‌నగర్,

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన  బస్సుయాత్రలు సక్సెస్ కావటంతో ఊరట చెందారు.ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్ది నవీన్‌రెడ్డి గెలువటం కొంత బూస్టునిచ్చింది.కాని లోక్‌సభ ఎన్నికల్లో రెండుస్దానాల్లో పార్టీ అభ్యర్దులు ఘోరంగా ఓడిపోవటం..మూడవ స్దానానికే పరిమితం కావటం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రేస్,బీజేపీ మద్యనే సాగింది.

నాగర్‌కర్నూల్ స్దానంలో కొంత ప్రభావం చూపగలిగినా..మహబూబ్‌నగర్ స్దానంలో మాత్రం ఎక్కడ కూడ ఆ పార్టీ అభ్యర్ది ప్రభావం చూపలేకపోయారు. ఈ స్దానం నుంచి 2009లో కేసీఆర్,2014లో జితేందర్‌రెడ్డి 2018లో మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు గెలిచి ఆపార్టీ హ్యాట్రిక్ సాధించింది.బీఆర్ఎస్ పార్టీ ప్రజాసమస్యలు విస్మరించిందని నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పెద్దఎత్తున బీఆర్ఎస్ ఓట్లు  బీజేపీకి బదిలీకావటం కూడ నష్టం కలిగించింది.అయితే కాంగ్రేస్ మాత్రం  బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కావాలనే పనిచేసిందని ఆరోపిస్తుంది. భవిష్యత్‌లో బీఆర్ఎస్‌కు స్దానం ఉండదని అంటుంది.కాని బీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ పాలమూరు జిల్లాలో పూర్వవైభవం సాధిస్తామని చెబుతున్నారు.

ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయటంలో కాంగ్రేస్ పార్టీ విఫలయ్యిందని మండిపడుతున్నారు.వచ్చే స్దానిక సంస్ధల ఎన్నికల్లో సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సొంత కావటం అత్యధికంగా ఎమ్మెల్యేలు,ఓ ఎంపీ కాంగ్రేస్ పార్టీకి ఉండటం…మరోవైపు మహబూబ్‌నగర్ స్దానంలో బీజేపీ ఆభ్యర్ది డీకే అరుణ గెలువటంతో ఆ రెండు పార్టీలను  బీఆర్ఎస్ పార్టీ ఎలా హ్యాండీల్ చేస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి