బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక అరాచకం

By KTV Telugu On 13 November, 2024
image

KTV TELUGU :-

బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అథోగతి పాలైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు చాలానే కళ్లెదుట కనిపిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులకు వేల కోట్లు ఎలా తగలేశారో జనం చూశారు. ఇప్పుడు ఆనకట్టలు బీటలు వారితే తమ తప్పేమీ లేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇలాంటి అవినీతికర ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. డబుల్ బెడ్ రూమ్ కేటాయింపులో ఫ్రాడ్స్ కూడా మనం చూశాం. ఇప్పుడు మరో అవినీతికర అంశం కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.

కేసీఆర్ ప్రభుత్వ చివరి రోజులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను రేవంత్ సర్కారు పరిశీలిస్తున్నప్పుడు అనేక విస్తుపోయే నిజాలు వెల్లవుతున్నాయి. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారం కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.
అవి కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేసే బ్యాచ్ కోసం విడుదల చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఆదేశాల్లో రీల్స్ కోసం 15 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ప్రచార పిచ్చి ఉంటుంది. ఇందులో కాదనడానికి లేదు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ బ్యాచ్ కోసం 15 కోట్లు ఖర్చు చేయడమే సంచలనంగా మారింది. ఒక నిమిషం రీల్ కోసం లక్ష రూపాయలు ఫీజు చెల్లించారని ఇప్పుడు బయటపడింది…

కేసీఆర్ వెంట నీడిలా తిరిగే ఆయన సన్నిహితుడే ప్రభుత్వం పథకాల ప్రచారంలోనూ, రీల్స్ తయారీలోనూ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అప్పట్లో అతడ్ని షాడో ముఖ్యమంత్రి అని కూడా పిలిచేవారు. ఆయనే డిజిటల్ మీడియాను పర్యవేక్షించేవారు. ఎవరు ఏ రీల్స్ చేయాలో ఆయనే నిర్ణయించేవారు. ఆర్టిస్టులను కాంట్రాక్టుకు తీసుకోవడం, వారికి సబ్జెక్ట్ వివరించడం కూడా ఆయనే చేసేవారని చెబుతున్నారు. ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలన్నింటికీ ఇలా వీడియో ప్రచారాలు చేయించారట. పైగా సదరు కీలక వ్యక్తికి ఒక యాడ్ ఏజెన్సీ కూడా ఉండేదని ఆ క్రమంలో ఏజెన్సీ కమిషన్ కూడా ఆ సంస్థకే వెళ్లిపోయేదని కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్గత విచారణలో తేలింది.

ప్రజల సొమ్ము వృథా చేయడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రీల్స్ కోసం 15 కోట్ల వ్యయం కేవలం శాంపిల్ మాత్రమేనని అలాంటి పనులు చాలానే జరిగాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు ఓడించారని ఆరోపిస్తున్నారు. పార్లమెంటులో ఆ పార్టీకి గుండు సున్నా వచ్చిందంటున్నారు. రీల్స్ కు 15 కోట్లు ఖర్చు పెట్టిన వ్యవహారంలో విచారణ జరిపించి.. జరిగిన అవినీతిని వెలికితీయాలని కాంగ్రెస్ సర్కారు డిసైడైనట్లు తెలుస్తోంది. మరి ఆ పని ఎప్పుడు జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి