హైడ్రా దెబ్బకు కుదేలైన రియాల్టీ

By KTV Telugu On 26 September, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం అమ్మకాలు లేక కూనారిల్లుతోందా. అంతర్జాతీయ నగరం హైదరాబాద్ లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయా. కొనుగోళ్లు లేక వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. భారీ నష్టాలతో రియల్టర్లు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారా.. ఇలాంటి ప్రశ్నలకు ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది కాలంలోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో అమ్మకాలు 42 శాతం మేర తగ్గిపోయాయి.

ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి రియల్ ఎస్టేట్ రంగం.. ఇంకొకటి మద్యం వ్యాపారం. అందుకే.. ఆ రెండింటిని ప్రోత్సహించి ఏ ప్రభుత్వం అయినా ఆదాయం పెంచుకోవాలని చూస్తుంటుంది. అయితే.. ‘గతమెంతో ఘనం.. వర్తమానం శూన్యం’ అన్నట్లుగా తయారైంది హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి. నిజానికి ఇండియాలో.. అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో హైదరాబాద్ ఒకటి.ముంబై, పూణే ఢిల్లీ కంటే…ఇప్పుడు హైదరాబాద్ టాప్ లో ఉందని చెప్పవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది.అయితే అలాంటి హైదరాబాద్ నగరం ఇప్పుడు.. అబాసపాలు అవుతోంది. హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు బయటికి వెళ్లిపోవడం, కొత్త కంపెనీలు రావడంలో సందిగ్ధత నెలకొనడం… లాంటి పరిణామాల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై కనిపిస్తున్నాయి. ఇదంతా హైడ్రా ప్రభావమేనని భావిస్తున్నారు. ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ లాంటి అర్థం కాని పదాలతో హైడ్రా సంస్థ రంగ ప్రవేశం చేసి ఇళ్లు కూల్చేస్తోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆవాస ప్రాంతాలు కూడా హైడ్రా దెబ్బకు కూలిపోయాయి. దీనితో కొనాలంటేనే జనం వణుకుతున్నారు. ఏది అక్రమ లేఅవుట్, ఏది సక్రమమైన నిర్మాణమో అర్థకాక కొనుగోళ్లకు జనం దూరంగా ఉంటున్నారు. దీనితో రియల్ ఎస్టేట్ రంగం మందగించింది.

కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఎప్పుడు ఎలాంటి నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని జనం ఆందోళనలతో ఉన్నారు.హైదరాబాద్ పరిధిలో జూన్ – సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాలను పరిశీలిస్తే ఈ అంశాలన్నీ ఇట్టే అర్థం అవుతున్నాయి. మహానగరంలో ఏకంగా 42 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. ఈ లెక్కలను ఎవరో చెప్పింది కాదు.. రియల్ ఎస్టేట్ అనలైటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయిందని ఈ సంస్థ… లెక్కలతో సహా బయట పెట్టింది.
ఇప్పటివరకు 12000 పైచిలుకు యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగినట్లు వివరించింది . అదే గత సంవత్సరంలో 20 వేల వరకు యూనిట్లు అమ్ముడు అయ్యాయట.

నిజానికి రేవంత్ ప్రభుత్వానికి ఇప్పుడు భారీగా ఆదాయం అవసరం. గ్యారెంటీల అమలుకు ఇప్పుడు నిధులు కావాలి. ప్రభుత్వ ఖజానాకు రియల్ ఆదాయమే ప్రాతిపదికగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి