విన్నారుగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారో. విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారట. నిజానికి కొన్ని వారాల ముందే సీఎం ఫారిన్ టూర్ డిసైడ్ అయింది. రేవంత్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. గత జనవరిలో ఆయన స్విట్జర్లాండ్, లండన్, దుబాయ్ దేశాల్లో పర్యటించారు. లేటెస్ట్‌గా.. వచ్చే ఆగస్ట్ 3న రేవంత్ అండ్ కో అమెరికా బయల్దేరుతుంది. ఈ టూర్‌లో.. వివిధ కంపెనీల సీఈఓలతో పాటు కొందరు పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తారని తెలుస్తోంది. వాళ్లతో చర్చించి.. రాష్ట్రానికి పెట్టుబడుల తీసుకొస్తారని చెబుతున్నారు. ముఖ్యంగా.. డల్లాస్‌తో పాటు ఇతర స్టేట్స్‌లోనూ సీఎం రేవంత్ టూర్ కొనసాగుతుంది. తిరిగి.. ఆయన ఆగస్ట్ 11న అమెరికా నుంచి తెలంగాణకు వస్తారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది.. కానీ.. ప్రతి దానికీ.. ఓ సమయం, సందర్భం అనేది ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలో.. అప్పుడే జరుగుతుంది. అలా కాకుండా.. మనం ఫ్రీగా ఉన్నాం కదా అని చేసుకుంటూ వెళ్లిపోతే.. రిజల్ట్ మరోలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా.. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే టార్గెట్‌గా సీఎం రేవంత్ టూర్ అమెరికా పర్యటన కొనసాగబోతున్నట్లు చెబుతున్నారు. కానీ.. ఇప్పుడు అమెరికా మొత్తం ఎలక్షన్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ఓ వైపు ట్రంప్.. మరోవైపు కమలా హారిస్.. ఇద్దరికిద్దరు.. తర్వాత అధ్యక్ష పీఠంపై ఎవరు కూర్చొవాలన్నది తేల్చుకునేందుకు ప్రచారాన్ని హీటెక్కించారు. ఇలాంటి టైమ్‌లో.. రేవంత్ పెట్టుబడుల వేట ఎంతమేరకు సక్సెస్ అవుతుందనేదే బిగ్ క్వశ్చన్. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయ్. ఎన్నికలకు మరో 4 నెలల టైమ్ మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో.. అక్కడి కంపెనీల సీఈవోలు, పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారా? అన్నదే మేజర్ పాయింట్.
సరే.. సీఎం రేవంత్ అమెరికా దాకా వచ్చారు కదా అని.. వాళ్లంతా అపాయింట్‌మెంట్ ఇచ్చినా.. కచ్చితంగా పెట్టుబడులు పెడతారనే గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే.. అమెరికాకు చెందిన కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తలంతా.. నెక్ట్స్ తమ దేశంలో ఏర్పడబోయే ప్రభుత్వం ఆధారంగానే.. నిర్ణయాలు తీసుకుంటారు. మళ్లీ.. డెమొక్రాట్లకే అధికారం దక్కుతుందా? లేక.. ట్రంప్‌కే అమెరికా జై కొడుతుందా? అనేది.. ఇప్పట్లో తేలే అవకాశం లేదు. ట్రంప్ గనక గెలిస్తే.. విదేశాల్లో పెట్టుబడుల అంశంలో ఆయనెలాంటి పాలసీలు తీసుకొస్తారన్న దానిపైనా చర్చ జరుగుతోంది. డెమొక్రాట్లు గెలిస్తే.. వాళ్లు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఏ రకంగా చూసినా.. అమెరికా నుంచి తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఇది.. కరెక్ట్ టైమ్ కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. గత విదేశీ పర్యటనల కంటే.. ఈసారి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించాలని రేవంత్ అండ్ కో టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ.. అమెరికా మొత్తం ఎన్నికల ఫీవర్‌తో ఊగిపోతున్న సమయంలో.. పెట్టుబడులు ఏ విధంగా సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…