ఆరు బెర్తులు, లెక్కలేనన్న కర్ఛిఫ్ లు…

By KTV Telugu On 6 August, 2024
image

KTV TELUGU :-

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముహుర్తం రాబోతోంది. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఈ సారి ఖాయమని తేలిపోయింది.  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ తిరిగి రాగానే విస్తరణ పని  పూర్తి చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరున అంటే శ్రావణమాసం శుభదినాల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం  ఉండాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమెరికా  పర్యటనలోనే దీనిపై  కసరత్తు  పూర్తి చేస్తున్నారని తెలిసింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతోంది. అధికారం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డి 11 మందితో కలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరితోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు.  కొందరు మంత్రులకు ఎక్కువశాఖలు ఉండటంతో పని వత్తిడి పెరుగుతోంది. పైగా  ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించాల్సి ఉంటుంది. పైగా ఆశావహులు  పెరిగిపోతున్న తరుణంలో కొంతమందినైనా సంతృప్తి  పరచాల్సిన అనివార్యత ఉంది. ఎమ్మెల్యేలే కాకుండా కాబోయే ఎమ్మెల్సీలు కూడా మంత్రిపదవిని ఆశిస్తున్న  తరుణంలో ఎవరికీ కోపం రాకుండా బ్యాలెన్స్ చేయాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. వర్గ పోరాటాలు, గ్రూపు తగాదాలు, కుల సమీకరణాలకు ఇబ్బంది లేకుండా మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఆరు పోస్టులకు 26 మంది వరకు పోటీ పడుతున్న తరుణంలో చాలా జాగ్రత్తగా పావులు కదపాలి.

అలా జరిగితే కోదండరామ్ ను బీఆర్ఎస్ అవమానపరిస్తే తాము న్యాయం చేశామని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్  పార్టీ భావిస్తోంది.ఒకే సారి ఆరుగురిని  కాకుండా ఈ సారి ముగ్గురు నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఒక మాట ప్రచారమవుతోంది. దీని వల్ల మరో రెండు పోస్టులు ఖాళీ పెట్టి.. ఆశావహులతో గెస్సింగ్ గేమ్ ఆడొచ్చని లెక్కలేసుకుంటున్నారు.  హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. మరి వచ్చే నలుగురు మంత్రులూ ఈ జిల్లాల వారు అయి ఉంటారా? లేక ఇతర జిల్లాలకు చెందినవారా? అన్నది చూడాలి. రెడ్డి సామాజికవర్గం వారు మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండటంతో ఈ సారి మరో రెడ్డికి అవకాశం రాకపోవచ్చని భావిస్తున్నారు. సిటీకి చెందిన దానం నాగేందర్ కు మంత్రివర్గంలో చోటు దక్కొచ్చు. రేవంత్ ఆదేశించారన్న ఏకైక కారణంతో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఓడిపోయినా సరే వెనుకాడకుండా అసెంబ్లీలో బీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంటున్నారు. ఏదేమైనా  సరే సీఎం రేవంత్ అమెరికా నుంచి వచ్చిన వెంటనే మంత్రివర్గ విస్తరణ జరగడం మాత్రం ఖాయం….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి