సీఎం రేవంత్ రెడ్డి పై సొంత నియోజకవర్గ ప్రజల తిరుగుబాటు

By KTV Telugu On 10 October, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం అయినా కొడంగల్ లో, కొడంగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరుతో భూములను సేకరించి ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని, కానీ కంపెనీలకు మా భూములను ఇచ్చేది లేదంటూ కొడంగల్ నియోజకవర్గ రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయమై బాధిత రైతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమ సమస్యను వివరించారు

ఫార్మా కంపెనీల పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ దందాను కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి చర్యలు చేస్తున్నారని కేటీఆర్ రైతులకు అండగా నిలుస్తామన్నారు

కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుండగా, రైతులు ఎట్టి పరిస్థితి లోనూ తమ భూములను ఇవ్వబోమని , ప్రతిపక్ష నేతలతో కలిసి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారు పోలెపల్లి ఎల్లమ్మ దేవస్థానం నుంచి దుద్వాల్ కార్యాలయం వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు

పాదయాత్రకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని అందుకే అరెస్టు చేశామన్నారు పోలీసులు. మహేందర్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసు వాహనంలో కొడంగల్ నుండి పరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అక్కడ నుండి షాద్నగర్ తీసుకెళ్లారు

బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో, బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైతులకు నష్టం కలిగే విధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. రైతులకు మద్దతుగా ఫార్మా కంపెనీ ఏర్పాటును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ దందా ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని వదిలేదే లేదని , ఆయన చేస్తున్న కుట్రలను బయటపెడతామన్నారు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి