కొత్త వివాదంలో కొండా సురేఖ..

By KTV Telugu On 25 November, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంటేనే వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. ప్రతీనిత్యం ఏదోక వివాదంలో చిక్కుకుంటూ ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. పైగా మంత్రిగా ఉన్నందున సురేఖ మాట్లాడే మాటలకు మీడియాలోనూ ఎక్కువ ఫోకస్ వస్తోంది. దానితో కక్కలేక మింగలేక కాంగ్రెస్ పెద్దలు తంటాలు పడుతున్నారు.

11 మంది కేబినెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తోంది. ఇప్పటి సురేఖ రెండు మూడు వివాదాల్లో చిక్కుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి లేని తలనొప్పులు, తలవంపులు తెస్తున్నారు. ఇటీవలే తనను సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ నాయకులు ట్రోల్‌ చేశారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి లేని వివాదం కొనితెచ్చుకున్నారు. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు బూమరాగ్‌ అయ్యాయి. దీంతో ఆ వ్యాఖ్యలు ప్రముఖ హీరో నాగార్జునకుటుంబంతోపాటు, హీరోయిన్‌ను తాకాయి. దీంతో ఇండిస్ట్రీ నుంచి మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మొత్తం వ్యవహారంలో మంత్రి సురేఖ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాగార్జున వేసిన పరువునష్టం కేసు విచారణలో ఉంది.

ఆ సంగతిని జనం మరిచిపోకముందే మంత్రి సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో బీరు పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు.రెండు రోజుల క్రితం మంత్రి మనవవాలి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి తన ఇంట్లో బీరు, బిర్యానీ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ సంగతి బయటకు వెళ్లిపోవడంతో ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొండా సురేఖకు ఎవరో వీడియో కాల్ చేయగా.. తన ఇంట్లో పుట్టిన రోజు పార్టీ జరుగుతోందని ఆమె చెప్పారు. అప్పుడు అవతలి వ్యక్తి బిర్యానీ మాత్రమేనా, బీరు లేదా అని ప్రశ్నించారు. బిర్యానీ ఉందంటే బీరు ఉన్నట్లే కదా అని సురేఖ సమాధానం ఇచ్చారు. సురేఖ అలా మాట్లాడిన వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ కావడంతో పెద్ద వివాదమే రేగుతోంది. దేవాదాయ మంత్రిగా ఉంటూ ఆలయాలను పర్యవేక్షించాల్సిన ఆమె.. బీరు పార్టీ గురించి మాట్లాడటమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అది ముమ్మాటికీ తప్పేనని వాళ్లు అంటున్నారు. అయితే అది ఆమె వ్యక్తిగత విషయమని వాదించే వాళ్లూ ఉన్నారనుకోండి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి