రాయలసీమకు చెందిన ముగ్గురు మహిళా నేతలు ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తామే సర్వాధికారులమంటూ ఓవరాక్షన్ చేసి.. పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు.రాజకీయాల్లో పండిపోయిన నేతలు సైతం చేయని పనులను వీళ్లు నిర్వహిస్తూ.. అందరికీ తలనొప్పులు తెస్తున్నారు. వాళ్లే ఆళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవీరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి…
అఖిలప్రియ ఎవరి మాట వినడం లేదు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పైగా కోపం వస్తే ఎవరి మీదనైనా ఆమె చేయి చేసుకుంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఏ తీరుగా గందరగోళానికి కారణమయ్యారో..భూమావారమ్మాయి ఇప్పుడు కూడా అదే తీరులో గోల గోల చేస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ నేతలు వాపోతున్నారు. శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయినా కుట్టదు అన్నట్లుగా… తన ఆదేశాలతోనే అన్ని పనులు జరగాలని, తనకు చెప్పకుండా ఏ పని జరగడానికి వీల్లేదని అఖిలప్రియ హుకుం జారీ చేశారు. పైగా పార్టీలో ప్రతీ ఒక్కరితో ఆమె తగవులు పెట్టుకుంటున్నారు….
మద్యం టెండర్ల విషయంలోనూ అఖిలప్రియ పెత్తందారీతనం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆమె అనుచరులకు ఈ సారి ఒక్క షాపు కూడా దక్కలేదు. పైగా పార్టీలోనే ఆమె ప్రత్యర్థులు టెండర్లు దక్కించుకున్నారు. దానితో తన అనుమతి లేకుండా ఒక్క షాపు కూడా తెరవకూడదని ఆళగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ హుకుం జారీ చేశారు. పైగా ఆమె చిరకాల ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డి అనుచరులకు షాపులు దక్కడం కూడా అఖిలప్రియకు సుతారమూ నచ్చలేదు.ఆమె చర్యల కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఇప్పుడు నంద్యాల జిల్లాలో టాక్….
కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి ధోరణి వివాదాస్పదమవుతోంది. నాలుగు నెలల పాలనకే మాధవీరెడ్డి అంటే కడప జనం జడుసుకునే పరిస్థితి వచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ వాళ్లను కొట్టి తరమండీ అన్నట్లుగా ఆమె మాట్లాడుతున్నారు. తాజాగా కడప టీడీపీ నగర అధ్యక్షుడు శివకొండారెడ్డిపై దాడి జరిగితే, ఇంత వరకూ ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన మాధవీరెడ్డి నుంచి కనీసం ఖండన కూడా కనిపించడం లేదు. నాలుగు నెలల్లోనే ఐదేళ్లకు సరిపడేంత చెడ్డపేరు తీసుకొచ్చారంటూ మాధవీరెడ్డి దొపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల్ని చంద్రబాబు, లోకేశ్‌లకు సొంత పార్టీ నాయకులు పంపారు.
టీడీపీకి మరో తలనొప్పిగా పులివర్తి సుధారెడ్డి తయారయ్యారు. ఎమ్మెల్యే నాని..భార్యగా సుధారెడ్డి అధికారాన్ని చెలాయించడం చంద్రగిరిలో టీడీపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకున్నారు. అయ్య బాబోయ్ అని టీడీపీ అనుబంధ పత్రికే రాసిందంటే ఇక ఆమె ఏ రేంజ్‌లో చంద్రగిరిలో అధికారాన్ని చెలాయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.పేరుకే చంద్రగిరికి నాని ఎమ్మెల్యే. అనధికార ఎమ్మెల్యే తానే అని పులివర్తి సుధారెడ్డి ఆ మధ్య ప్రెస్‌మీట్‌లో తానే ప్రకటించుకోవడాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇసుకైనా, మద్యం వ్యాపారమైనా, భూమి పంచాయితీలైనా… చంద్రగిరిలో చీమ కుట్టాలన్నా సుధారెడ్డి కనుసైగ చేయాల్సిందే అని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ముగ్గురు రెడ్డెమ్మలు ఇప్పుడు అధికార టీడీపీ పరువులు బజారుకీడ్చుతున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…