తెలంగాణ బాపు !

By KTV Telugu On 19 February, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది అద్భుతమైన ఆయుధం..  ఆ ఆయుధంతో విజయాలు తెచ్చుకుని దాన్నే పక్కన పడేసి పలితాన్ని అనుభవిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ను ప్రొజెక్ట్ చేసి ఆయనను కాపాడుకునేలా అందర్నీ మోటివేట్ చేయాలనుకుంటున్నారు. ఆటోమేటిక్ గా అది ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్న ఆశలతో కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు. అయితే ఓడిపోయిన తర్వాత ఈ ప్రచారం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందన్నదే సమస్య

బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతిపిత బాపూ అంటూ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు  తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదినం సందర్భంగా శనివారం ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాతిపిత బాపూ పేరిట సరికొత్త ప్రచారం సాగించారు.  తెలంగాణలో ఓటమి పాలవడంతోపాటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి కాళేశ్వరం నుంచి కృష్ణ జలాల వరకు విమర్శల వర్షం కురుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేందుకు బీఆర్ఎస్ నాయకులు బాపూ ప్రచారంతో ముందుకు వెళుతున్నారు.   చావు నోట్లో తల పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా, బాపూ అని పిలవడం ఆయనకు మనం ఇచ్చే గౌరవమని  బీఆర్ఎస్ నేతలంటున్నారు.

సీఎంగా ఉన్నపుడు కేసీఆర్ జన్మదినోత్సవాలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగేవి. కానీ ఈ సారి ఓటమి పాలవడంతో కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నా, ఆ పార్టీ నేతలు మాత్రం మన తెలంగాణ బాపూ అంటూ ప్రచార హోరు సాగించారు.  కేసీఆర్ బాపూ ప్రచారం శనివారం వాట్సప్, ఫోన్ కాల్స్ ద్వారా ముమ్మరం చేశారు.  కేసీఆర్ కు విష్ చేసేందుకు ఓ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ . ఆ ఫోన్ నంబరుకు రింగ్ మిస్డ్ కాల్ చేస్తే చాలు వెంటనే ‘‘ప్రతీ తెలంగాణ బిడ్డకు పేరుపేరునా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’అంటూ కేసీఆర్ తన వాయిస్ వినిపించారు. తెలంగాణ పితామహుడు మన తెలంగాణ జాతిపిత బాపూ’’ అంటూ బీఆర్ఎస్ నేతలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు.  కేసీఆర్ 70 వ జన్మదినం సందర్భంగా తెలంగాణ సెంటిమెంటును రగిల్చేలా, కేసీఆర్ ప్రతిష్ఠ పెంచేలా ఆడియో, వీడియో పాటల ద్వారా ప్రచారం సాగించారు.

కేసీఆర్‌ పదేళ్ల పాలనపై, కాళేశ్వరం అవినీతి దందాపై కాంగ్రెస్‌ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆయన ఇమేజ్‌ను పెంచేందుకు, తెలంగాణ బాపూగా ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా బాపూగా ప్రచారం సాగిస్తూ బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ప్రజలు సైతం కేసీఆర్‌ను బాపూగా పిలిచేలా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్‌ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్‌ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపూ అని అంటున్నారు.ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈ ప్రచారం వెనుక భిన్నమైన వ్యూహం ఉంది. కేసీఆర్  తెలంగాణ సాధించిన వ్యక్తిగా ప్రజలు గుర్తుంచుకోవడం తో పాటు ప్రభుత్వం రేపు ఏదైనా కేసులో అరెస్ట్ చేస్తే..   ఈ సెంటిమెంట్ రగిల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రేపు అవినీతిపై చర్యలు తీసుకున్నా తెలంగాణ బాపుపై చర్యలు తీసుకున్నారని గగ్గోలు పెట్టవచ్చని ప్లాన ్చేసుకుంటున్నారు. కేసీఆర్‌ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్‌ తెలంగాణ సమాజానికి జాతిపిత బాపూ అని అంటున్నారు. ఈ ప్రచారం ముందు ముందు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమిలోఉంది. ఇలా ప్రచారం చేయడాన్ని ఎక్కవ మంది ట్రోల్ చేస్తున్నారు. ఇది సరైన సమయం కాదని అంటున్నారు. కానీ ఇప్పుడు కాకపోతే లోక్ సభ ఎన్నికల తర్వాత అసలు ప్రచారం చేయలేమని.. బీఆర్ఎస్ నేతలకు కూడా బాగా తెలుసన్న  అంచనాలు ఉన్నాయి.

కేసీఆర్ మూడో సారి గెలిచి ఉంటే ఆయన ఇమేజ్ దేశంలోనే ప్రత్యేకంగా ఉండేది. తెలంగాణలో అయితే ఆకాశంలో ఉండేది. కానీ ఓడిపోవడం వల్ల ఆయన తెలంగాణ సాధకుడ్ని తానేనని కూడా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ గుర్తింపు ఇవ్వడానికి కూడా  చాలా మంది సిద్ధంగా లేరు. ఈ తెలంగాణ బాపు అనే ప్రచారం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సి ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి