ఏడాది ఉండే పదవి కోసం రాష్ట్ర పార్టీ మొత్తం నెల రోజులు అక్కడే ఉండాలా ? ఎన్నికల వ్యయంలో ప్రపంచ రికార్డులు సృష్టించాలా ? ఇకపై ఏం జరగబోతోంది ? మునుగోడు ఉప ఎన్నిక సెట్ చేసిన బెంచ్ మార్క్ ఏమిటి ?
గెలిచినా, ఓడినా ప్రభుత్వ మనుగడపై ప్రభావం లేని ఎన్నిక
గులాబీ దళపతి తన పరువు సమస్యగా తీసుకున్న ఎన్నిక
ఊరికో ఎమ్మెల్యేను ప్రచారంలోకి దించిన వైనం
మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
కేవలం 4 శాతం మెజార్టీతో సరిపెట్టుకున్న టీఆర్ఎస్
దుబ్బాక, హుజురాబాద్ లో జరిగిన పొరపాట్లు మునుగోడులో జరగకూడదని ఆ నియోజకవర్గం తమకే సొంతం కావాలని ప్లాన్ చేశారు. గెలిచినా, ఓడినా ప్రభుత్వ మనుగడపై ఆ ఎన్నిక ప్రభావం ఉండదని తెలిసినప్పటికీ గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో నెలరోజులు పగలూ రాత్రి పనిచేశారు పార్టీ కేడర్ ను పనిచేయించారు. 80 మంది ఎమ్మెల్యేలకు మునుగోడు డ్యూటీ వేశారు. మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. అంతచేసినా టీఆర్ఎస్ కు వచ్చినదీ కేవలం 10 వేల 309 ఓట్ల మెజార్టీ మాత్రమే. గెలిచిన పార్టీకి, ఓడిన పార్టీకి మధ్య ఉన్న తేడా నాలుగు శాతం మాత్రమే..
ఉద్యమ పార్టీ అంత శ్రమ పడటం అవసరమా
బీఆర్ఎస్ టేకాఫ్ కు ఈ గెలుపును వినియోగించాలని భావించారా
అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్షాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం
ఓటర్లలో మరింతగా విభజన తీసుకురావడమే ధ్యేయం
ఒక ఉద్యమ పార్టీ ఉప ఎన్నిక కోసం ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు. 150 కోట్లు ఖర్చు పెట్టాలా అన్న ప్రశ్న తెలెత్తొచ్చు. అయినా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటమిని ముటగట్టుకుని తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదనే కేసీఆర్ అదనపు సమయాన్ని, కేడర్ ను, నిధులను కేటాయించారు. బీజేపీ అభ్యర్తి రోజగోపాల్ రెడ్డి సాధించిన ఓట్లు ఆయనలో అనుమానాలకు, భయాలకు దర్పణం పట్టాయి. మరో పక్క జాతీయ పార్టీ బీఆర్ఎస్ పట్ల ఇతర రాష్ట్రాల్లో చర్చ జరగాలంటే మునుగోడులో గెలిచి నిలవాలని కేసీఆర్ భావించిట్లున్నారు. మునుగోడు విజయం ద్వారా కేసీఆర్ తన ప్రత్యర్థులకు చాలా సందేశాలే ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ జైత్ర యాత్ర అంత సులభం కాదని చెప్పగలిగారు. గట్టి పోటీ ఇవ్వగలదే తప్ప బీజేపీ పూర్తిగా టీఆర్ఎస్ ను మట్టి కరిపించలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్నదని అటు నాయకులు, ఇటు కేడర్ ఆ పార్టీకి దూరమవుతున్నారని మునుగోడు ఎన్నిక ద్వారా కేసీఆర్ సందేశమిచ్చేశారు, నిజానికి కాంగ్రెస్ పార్టీకి మరో ఇరవై వేల ఓట్లు వచ్చి ఉంటే మునుగోడు ఫలితం వేరుగా ఉండేది. ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్ చూసుకోగలిగారు.
టీఆర్ఎస్ కేడర్ కూ పెరిగిన మనోధైర్యం
బీజేపీ దూకుడుకు కళ్లెం
ఇకపై ఉప ఎన్నికలు ఉండకపోవచ్చు
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే అధికార పార్టీ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉంటాయని భావించారు. వెళ్లాలనుకున్న వారు ఉప ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు చెప్పుకున్నారు. టీఆర్ఎస్ విజయంతో వాళ్లంతా సైలెంట్ అయిపోయారు. ఏమీ తెలియనట్లు పార్టీలో పనిచేసుకుంటారు. ఈ విజయం టీఆర్ఎస్ కేడర్ కు కూడా మనోధైర్యాన్నిచ్చింది. బీజేపీ గెలిస్తే తమ పార్టీ పరిస్థితేమిటని ఆలోచనలో పడిన వారికి మనోధైర్యాన్నిచ్చింది. పైగా బీజేపీ దూకుడుకు కూడా మునుగోడు ఫలితం కళ్లెం వేసింది. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే వేరు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని మరిన్ని ఉప ఎన్నికల తీసుకురావాలన్న బీజేపీ వ్యూహానికి బ్రేకులు పడినట్లయ్యింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకే అధికారాన్ని కట్టబెడతారన్న అతి విశ్వాసంతో నడుస్తున్న బీజేపీకి ఇప్పుడు అసలు సంగతి తెలిసొచ్చింది. కేసీఆర్ మామూలోడు కాదని అర్థమైపోయింది.
సొంత కుంపటిని సరిదిద్దుకోవాల్సిన కాంగ్రెస్
విమర్శలు మాని అంకితభావంతో పనిచేయాలి
తటస్థ ఓటర్లకూ ఒక సందేశం
అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పుడే డెసిషన్
కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికతో బాగా దెబ్బతిన్నది. పార్టీలో విభేదాలే అభ్యర్థి విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీశాయని నేతలు గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. పరస్పర విమర్సలు మాని పార్టీని బలోపేతం చేసే చర్యలను చేపట్టాలని పై నుంచి కిందకు కాంగ్రెస్ నేతలంతా గుర్తించాలి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేనందున రాహుల్ యాత్ర తెలంగాణ దాటి పోయిన వెంటనే కార్యాచరణకు దిగాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 40 శాతంపైగా ఓట్లు ఉన్నట్లు ప్రస్తుత ఉప ఎన్నిక చెప్పకనే చెప్పింది. ఇదీ తటస్థ ఓటర్లకు ఒక సందేశమవుతుంది. టీఆర్ఎస్ కు కాకుండా మిగతా వారికి ఓట్లు వేస్తే తమ ఓటు వృథా అవుతుందని అర్థం చేసుకోవాల్సిన సమయం వస్తుంది. వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పై ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు టీఆర్ఎస్ ఓట్ షేర్ మరికొంత పెరుగుతుంది.