టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి నమోదైన కేసును దర్యాప్తు చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ అనంద్ నేతృత్వంలో ఆరుగురు పోలీసులు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో నల్గొండ ఎస్పి రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డిసిపి కమలేశ్వర్, నారాయణపేట ఎస్పి వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాదర్, శంసాబాద్ డీసీపీ జగదీశ్‌రెడ్డి, మొయినాబాద్ సిఐ లక్ష్మారెడ్డి ఉన్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు లాక్కునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అంతేకాదు ఈ విషయాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. దీనికంతటికీ బీజేపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభాలకు గురిచేసిదో వివరిస్తూ మీడియా సమావేశంలో కొన్ని ఆడియో, వీడియోల టేపులు ప్రదర్శించారు. ఈ కేసు విచారణపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో ప్రభుత్వం వెంటనే సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం జైల్లో ఉన్న నిందితులను కస్టడిలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.