సురక్ష తెలంగాణ

By KTV Telugu On 3 June, 2023
image

తెలంగాణ దశాబ్ద పయనంలో సురక్షితమైన తెలంగాణను మన కళ్ల ముందు సాక్షాత్కరింపచేయడంలో పోలీసులది ప్రత్యేకమైన పాత్ర. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇతర రాష్ట్రాల వారి ఆస్తులకు రక్షణ ఉండదు. వ్యాపారాలు చేసుకోలేరు అంటూ అనేక ప్రచారాలు చేశారు. అయితే పదో ఏట అడుగు పెట్టిన ఈ సందర్భంలో ఇన్నేళ్ల కాలంలో తెలంగాణపై చిన్న మరక పడకుండా పోలీసు యంత్రాంగం కాపాడుకుంది. అందుకే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పోలీసు శాఖకు సంబరాల్లో ప్రత్యేకంగా ఓ రోజు కేటాయించారు.

పోలీసు శాఖను ఉద్యోగుల గౌరవార్థం తెలంగాణ వ్యాక్తంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో పోలీస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించి సురక్ష దినోత్సవం నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడి పది సంవత్సరాలలో ప్రజల రక్షణ శాంతి భద్రతల రక్షణలో పోలీసు శాఖ అమలు చేస్తున్న విధి విధానాలు సాధించిన విజయాలు ప్రజల రక్షణ, బ్లూ కోర్స్, పెట్రో కార్స్, షీ టీమ్స్, భరోసా సెంటర్, డయల్ 100 కాల్, పాస్పోర్ట్ వెరిఫికేషన్, పోలీసు పని విభాగాల అమలు మొదలగు అంశాల గురించి ప్రజలకు వివరిస్తారు. కొనసాగింపుగా 12వ తేదీన ప్రజలు పౌరులు అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని పోలీస్ శాఖ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రన్ నిర్వహిస్తారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలోనే ఈ దశాబ్ది ఉత్సవాలు జరుగుతాయి.

భద్రత పరంగా తెలంగాణ ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకుంది. ఎక్కడ నేరం జరిగినా కనిపెట్టేలా హైదరాబాద్‌లో కమాండ్ సెంటర్ కూడా నిర్మాణం అయింది. పోలీసు వ్యసవ్థ అత్యాధునిక టెక్నాలజీతో ప్రజలకు సేవలందిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలకు భరోసా ఇచ్చి సురక్ష తెలంగాణను పోలీసు వ్యవస్థ సాకారం చేసింది. జై తెలంగాణ