మోదీ పగపడితే పుట్టగతులుండవా. కేంద్రంలో ఉన్న పార్టీతో కయ్యం తెలంగాణను ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందా. గుజరాత్ కే ఎక్కువ పెట్టుబడులు ఇచ్చే ప్రధాని మోదీ, తాజా సాకులతో రాష్ట్రాన్ని మరింత ఇరకాటంలోకి నెడతారా. తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ స్తాయికి దిగజారుతుందా ? విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్న తరుణంలో దేశీయ సంస్థలపైకూడా కేంద్రం ఒత్తిడి పెంచుతుందా ?
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం
ఒకరినొకరు ఫినిష్ చేసుకునే ప్రయత్నం
రాష్ట్రానికి తగ్గిన విదేశీ పెట్టబడులు
జాతీయ లెక్కలతో పోల్చితే రెండు శాతానికి పరిమితం
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకరినొకరు ఖతం చేసుకునే స్థాయికి ఆ యుద్ధం చేరుకుందనే చెప్పాలి. ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో టీఆర్ఎస్ అనుకూల వ్యాపారవేత్తలు, నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసుంటే ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నానికి సంబంధించిన కేసులో బీజేపీ నేతలను లోపలేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు నోటీసులు కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు కూడా క్షీణదిశలో ఉన్నాయి. టీఆర్ఎస్ ను పంపించేసి తెలంగాణను హస్తగతం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ. ఇకపై రాష్ట్రానికి సహకరంచే అవకాశాలు తగ్గిపోతున్నాయి. సర్వం గుజరాత్ అంటూ నినదించే మోదీ ఇతర రాష్ట్రాలపై శీతకన్ను వేస్తుండగా ఇకపై అది మరింత తీవ్రతరమయ్యే ప్రమాదముంది. ఇప్పటికే ఎక్కువ విదేశీ పెట్టుబడులు గుజరాత్ కే రావాలని మోదీ హుకుం జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశానికి 4 లక్షల 42 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తే అందులో గుజరాత్ కు 36 శాతం చేరింది. మోదీ స్వరాష్ట్రానికి లక్షా 62 వేల కోట్లు పెట్టుబడులు చేరాయి. తెలంగాణకు కేవలం 8 వేల 800 కోట్లతో రెండు శాతం పెట్టుబడులే వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కు విదేశీ పెట్టుబడులు ఒక శాతం లోపే ఉంది. వ్యాపారానుకూలత లేకపోవడమే ఏపీకి శాపమైతే అన్ని రకాలుగా ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్న తెలంగాణలో మాత్రం కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా పరిస్థితి అనుకూలించడం లేదు. 90 శాతం పెట్టుబడులు ఉత్తరాది రాష్ట్రాలకే చేరాలని కేంద్రం నిర్ణయించినట్లు భావించాల్సి ఉంటుంది.
రెండో అతి పెద్ద సాఫ్ట్ వేర్ కేంద్రంగా హైదరాబాద్
ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ గా తెలంగాణ
పెట్టుబడులను తీసుకురావడంలో కేసీఆర్, కేటీఆర్ నెంబర్ వన్
వస్త్ర పరిశ్రమల్లో కొత్త ఉద్యోగాలు
టీఆర్ఎస్ అధికారానికి వచ్చిన తర్వాత ఎనిమిదిళ్లుగా పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైంది. లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 70 శాతంపైగా పెట్టుబడులు వస్తుంటే. మిగతావి వరగంల్ సహా ఇతర జిల్లాలకు చేరుతున్నాయి. త్వరలోనే గార్మెంట్ ఇండస్ట్రీకి తెలంగాణ కేంద్రబిందువు అవుతోంది. కాకతీయ టెక్స్ టైల్ పార్క్ పేరుతో మూడు వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడి వర్గాల చెబుతున్నాయి. వీటన్నింటికీ మించి ఐటీ, భారీ పరిశ్రమల రంగంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పర్యాయపదంగా మారిన తరుణంలో ఆ రంగంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. కర్ణాటక నుంచి ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరుగుతుంటే తెలంగాణ నుంచి లక్షన్నర కోట్ల ఉత్పత్తులు వెళ్తున్నాయి. తెలంగాణను ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్ గా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిసైడై చాలా రోజులైంది.
కేసీఆర్ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారంటున్న మోదీ
కుటుంబ పాలనతో రాష్ట్రం అథోగతి పాలైందని ఆరోపణలు
కమిషన్లు,మార్జిన్లు పెరిగి ఇన్వెస్టర్లు వెనుకాడతున్నారని బీజేపీ అటాక్
రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొడుతున్నారని కేసీఆర్ ఆరోపణ
ITIR ఏర్పాటుకు కేంద్రం సహకరించలేదన్న కేసీఆర్
తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మసిపూసి మారేడుకాయను చేస్తున్నారని ఆన్నారు. కేసీఆర్ కుటుంబ పాలననే బీజేపీ టార్గెట్ చేసింది. కమిషన్లు, మార్జిన్లతో కేసీఆర్ కుటుంబం వ్యవస్థలను కప్పు కూల్చుతోందని ఆరోపిస్తోంది. రాష్ట్రాన్ని మోదీ ఆర్థికంగా బలహీనపరుస్తున్నారని కేసీఆర్ మూడు నెలలుగా ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను అందకుండా దొంగలెక్కలతో దోచుకుంటున్నారని విమర్శించిన సందర్భాలున్నాయి. తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్లు కేంద్రం తినేసిందని ఆయన తరచూ అంటారు. ఐటీ రంగానికి సంబంధించి ఒక అంశంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య రాపిడి కొనసాగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రిజీమ్ ITIR ఏర్పాటుకు కేంద్రం సహకరించడం లేదని, అనుమతులు ఇవ్వడం లేదని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా వాపోతోంది. అదే జరిగి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణలో లక్షల ఉద్యోగావకాశాలు వచ్చేవని తెలంగాణ అంటోంది.
30 శాతం ఐటీ ఉద్యోగాలు తెలంగాణలోనే
టీ హబ్ పేరుతో స్టార్టప్స్ కు ప్రోత్సాహం
ఇప్పుడు అన్నింటినీ దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నం
ఈడీ, సీబీఐ దాడులతో భయం
తెలంగాణపై దుష్ట్రచారాలకు సిద్దం
పెట్టుబడులను తన్నుకుపోతున్నట్లు వేదాంత కేసులో వెల్లడి
ఇకపై పెట్టుబడుల మళ్లింపు వేగవంతం
ఇప్పటికే తెలంగాణలో ఏడు లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నాయి. దేశంలో పది ఐటీ ఉద్యోగాలు వస్తే అందులో మూడు తెలంగాణలోనే కనిపిస్తున్నాయి. స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. కేసీఆర్ స్వయంగా స్థాపించిన టీ హబ్ అందుకు కేంద్రబిందువైంది. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి అది అవకాశమిచ్చింది.. ఇప్పుడు వాటన్నింటినీ దెబ్బతీసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తెలంగాణపై దుష్ట్రచాలారాలకు వెనుకాడరని తెలుస్తోంది. ఐటీ, ఈడీ, సీబీఐ కేసులతో పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టినప్పుడు ఇన్వెస్ట్ మెంట్లు మందగిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా వచ్చే పెట్టుబడులను ఎటా మళ్లిస్తారో వేదాంతా కంపెనీ గుజరాత్ కు వెళ్లిన విధానాన్ని బట్టే అర్థమవుతుంది. మహారాష్ట్రకు రావాల్సిన 22 బిలియన్ డాలర్ల కంపెనీని గుజరాత్ తీసుకెళ్లిపోయారు. ఇదేమిటని మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే ఫోన్ చేసి అడిగితే ఇంతకంటే ఎక్కువ పెట్టుబడి మహారాష్ట్రకు తెప్పిస్తానని మోదీ హామీ ఇచ్చారట. ఇప్పుడు తెలంగాణపై మోదీ అదే గేమ్ ఆడవచ్చు. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టినట్లుగా పెట్టుబడుల ప్రస్తావనలను కూడా ఆపేయ్యొచ్చు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టకుండా పారిశ్రామికవేత్తలపై వత్తిడి తెచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.