ఖుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా కొలన్ హన్మంతరెడ్డి
సెటిలర్ల ఓట్లు కీలకం
సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పై సొంత పార్టీలో వ్యతిరేకత
బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేసే అవకాశం
గ్రేటర్ పరిధిలోని ఖుత్బుల్లాపూర్ నియోజకవర్గం .. మూడు జిల్లాల పరిధిలో ఉంటుంది. అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటి. ఎక్కువగా కార్మిక, శ్రామిక వర్గం ఉండే నియోజకవర్గం. పైగా అత్యధిక మంది సెటిలర్లు ఉంటారు. గత రెండు సార్లు కేపీ వివేకానంద్ గెలిచారు. ఓ సారి టీడీపీ తరపున గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మరోసారి బీఆర్ఎస్ తరపున గెలిచారు. అయితే ఆయనను బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికీ కలుపుకోలేదు. కేసీఆర్ కుటుంబానికి సన్నిహితునిగా పేరు పొందిన శంభీపూర్ రాజు ప్రత్యేకమైన వర్గం నడుపుతున్నారు. ఆయన వివేకానంద్ కు సహకరించే అవకాశం లేదు. అయితే వివేకానంద్ మాత్రం తన గెలుపునకు ఢో కా లేదని నమ్ముతున్నారు. కొలన్ హన్మంతరెడ్డి బీఆర్ఎస్ లో ఉండేవారు. 2014లో టీడీపీ అభ్యర్తిగా పోటీ చేసిన వివేకానంద్ కు గట్టి పోటీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ లోచేరారు. నియోజకవర్గం మొత్తం ఆయనకు గట్టి పరిచయాలు ఉన్నాయి. అదే సమయంలో బీజేపీ తరపున కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేయనున్నారు. ఆయన 2009లో ఇండిపెండెంట్ గా గెలిచారు. తర్వాత నిలకడ లేకుండా పార్టీలు మారుతూ వస్తున్నారు. అయినప్పటికీ ఆయనకీ బలం ఉండటంతో… ఖుత్బుల్లాపూర్ లో ఈ సారి త్రిముఖ పోటీ జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానందకు ఏకపక్షమయ్యే అవకాశాలు లేవు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…