రాహుల్ సభలో తెలంగాణ వాదుల హల్చల్

By KTV Telugu On 12 September, 2024
image

KTV TELUGU :-

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడక్కడ ప్రవాసులు ఏర్పాటును చేసిన సభల్లో ప్రసంగిస్తూ తన అభిప్రాయాలను, కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వ ఎన్డీయే సర్కారు విధానాలను ఎండగడుతూ, మతవాద పోకడలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో డాలస్ నగరంలో నిర్వహించిన సభ ఒకింత స్పెషల్ గా కనిపించింది. అక్కడ తెలంగాణవాదులు కొంత మేర హల్చల్ చేసేందుకు ప్రయత్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ హైడ్రాపై ఒక మహిళ ఆవేశంగా ప్రసంగించి… ప్రశంసించడం విశేషమనే చెప్పాలి. తెలంగాణకు పట్టిన దరిద్రమూ, భూఆక్రణలు హైడ్రాతో తొలగిపోతాయని ఆమె ప్రస్తావించారు.

దాదాపు 200 మంది మాత్రం డిఫరెంట్ గా కనిపించారు. వారిలో సగం మంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమానులుగానూ, మరో సగం మంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగానూ చెప్పుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే వాళ్లంతా తమ అభిమాన నాయకుల ఫోటోలతో ఉన్న అంగీలను ధరించి వచ్చారు. పైగా ఆ అంగీలు వీడియోల్లో పడాలని వాళ్లు ఎంతో తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్ కంటే ఆ ఇద్దరు నేతలకే ఎక్కువ ప్రాధాన్యం లభించిందని కూడా జనం చెప్పుకోవడం కనిపించింది.పైగా కుల గణన జరగాలని, అన్ని సామాజికవర్గాలకు సమ న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రస్తావించినప్పుడు తెలంగాణవాదుల హర్షధ్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.

ఎన్నికల ముందు నుంచే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేసులో ఉన్నారు. పార్టీ గెలిచిన తర్వాత పొంగులేటి ఇప్పుడు బాగా బలపడుతున్నారు. పొంగులేటికి సీఎం పదవి వస్తే తప్పేమిటని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికాలో ఉండే ప్రవాస తెలంగాణవారిలో కూడా అదే ఫీలింగ్ ఉంది. సీఎం రేవంత్ కంటే తమ అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటే చూడాలన్న కోరిక వారికి ఉన్నట్లుగా కనిపించింది. బహుశా అందుకే రేవంత్ మాత్రమే కాదు.. తెలంగాణలో ఆ ఇద్దరు నేతలు కూడా ఉన్నారని, వాళ్లు కూడా సీఎం అయ్యేంత సమర్థులని రాహుల్ దృష్టికు తీసుకెళ్లడమే అభిమానుల ధ్యేయంగా కనిపించింది. ఎందుకంటే రాహుల్ మొదటి నుంటి రేవంత్ ను సమర్థించారు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ సీఎం అవుతారని ఆయన బహిరంగంగానే చెప్పేశారు. పార్టీ అధికారానికి రాగానే రేవంత్ ను అధిష్టానం సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. అందుకే ఇప్పుడు కాస్త అయినా రాహుల్ మనసు మార్చేందుకు ఇతర నేతల అనుచరులు ప్రయత్నిస్తున్నారని అనుకోవాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి