ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాజకీయవర్గాల్లో సంచలనం అయింది. ఈ లిక్కర్ కేసు ఇప్పటిది కాదు. రెండున్నరేళ్ల నుంచి ఉంది. నెలల తరబడి జైల్లో మగ్గుతున్న నిందితులు ఉన్నారు. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్ అయ్యారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆమెను అరెస్టు చేయడం రాజకీయంగా పెను సంలలనమే. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏమిటి ? అందులో కవిత పాత్రమేటి ?
ఢిల్లీలో మద్యం పాలసీ విధానాన్ని మార్చాలనుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం . ఓ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక ద్వారా రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కావాలి. అందుకే ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి లెఫ్టనెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించారు. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చారు.
2022 ఏప్రిల్‌లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రెటరీగా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్..లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని… మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించాు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు డిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు. దీన్ని లెప్ఠ్‌నెంట్ గవర్నర్‌కు సమర్పించారు. ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఓ వైపు చీఫ్ సక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సీబీఐ, ఈడీ విచారణతో పలువురు అరెస్టులు
మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని.. మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించిందని సీబీఐ గుర్తించింది. కేసులు పెట్టింది. ఈడీ కూడా రంగంలకి దిగింది. అక్కడ్నుంచి కేసులు పరంపర ప్రారంభమయింది. ఢిల్లీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో సౌత్ లాబీ ఉంది. మద్యం వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న ఏపీకి చెందిన మాగుంట కుటుంబం కేంద్రంగా వ్యాపారం సాగింది. ఇందులో కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ చార్జిషీట్‌లో పేర్కొంది.
సౌత్ గ్రూప్ శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు)తో కలిసి మనీశ్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు.
అరుణ్‌పిళ్‌లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారని ఈడీ తెలిపింి.
ఆ సౌత్ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, శరత్‌రెడ్డి, కె.కవిత ప్రముఖ వ్యక్తులని తెలిపింది. ఈ సౌత్‌గ్రూపునకు ప్రతినిధులుగా అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్‌లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. వీరందా అప్రూవర్లు అయ్యారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని తెలిపారు. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్టు చేసినట్లుగా భావిస్తున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…