కవితకు బెయిల్ ఎప్పుడు ?

By KTV Telugu On 12 July, 2024
image

KTV TELUGU :-

భారత రాష్ట్ర సమితికి చెందిన ఇద్దరు కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు   ఢిల్లీలోనే ఉన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేయడానికే ఢిల్లీలో ఉన్నామని వారంటున్నారు.కానీ  మరో ప్రత్యేకమైన కారణంతోనే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ కారణం కవితకు బెయిల్ అనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కవితకు  బెయిల్ వచ్చేలా చేసేందుకు హరీష్, కేటీఆర్ అండర్ కవర్ ఆపరేషన్  చేస్తున్నారా ?. ఫలితం ఎలా ఉంటుంది ?

ఢిల్లీ లిక్కర్ స్కాం కల్వకుంట్ల కవితను మార్చి పదిహేనో తేదీన ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. మధ్యలో సీబీఐ కూడా అరెస్టు చూపించింది. అంటే ఇప్పుడు ఆమె అటు సీబీఐ కేసులో.. ఇటు ఈడీ కేసుల్లోనూ అరెస్టు అయ్యారు. ఇప్పుడు బెయిల్ రావాలంటే రెండు కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంది. దిగువ కోర్టులో అనుకూల ఫలితం రాలేదు. ఎగువ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా చార్జిషీటు విషయంలో న్యాయపరమైన అవకాశం దొరకడంతో వెంటనే.. డీఫాల్ట్ బెయిల్ కోసం దిగువకోర్టును  ఆశ్రయించారు. చార్జిషీటులో లోపాలున్నందున పరిగణనలోకి తీసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని కవిత తరపున బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

కవిత జైలుకు వెళ్లి దాదాపుగా నాలుగు నెలలు అవుతోంది. ఇంత కాలం జైల్లో ఉంచడం అన్యాయమని  న్యాయనిపుణులతో కోర్టుల్లో వాదించేందుకు కేటీఆర్, హరీష్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. పేరెన్నికగన్న న్యాయనిపుపుణలతో చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిణామాల్ని కనుక్కుంటూ.. కొత్తగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఆదేశాలిస్తున్నారని అంటున్నారు. ఢిల్లీలో ప్రముఖ లాయర్లతో కేసీఆర్ కూడా మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే కేటీఆర్, హరీష్ ఖచ్చితంగా కేసీఆర్ సూచనల మేరకే ఢిల్లీలో వ్యవహారాలు చక్క బెడుతున్నారు.. కానీ అది లాయర్లతో మాట్లాడటం కాదు తెర వెనుక రాజకీయాలు కూడా చేస్తున్నారని అంటున్నారు. దానికి వారు ఢిల్లీలో ని్వహించిన మీడియా మీటే సాక్ష్యం అనుకోవచ్చు.

ఢిల్లీలో కేటీఆర్ ప్రధానంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీపై ఏ విషయంలో రాహుల్ విమర్శలు చేస్తూంటారో వాటినే  హైలెట్ చేసుకున్నారు. ఇటీవల రాహుల్ రాజ్యాంగం మిని బుక్ ను చేతిలో పెట్టుకుని బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా..  ఫిరాయింపుల విషయంలో తాను రాజ్యాంగం  బుక్ ను పంపిస్తానని రాహుల్ కు సవాల్ చేశారు. ఇంకా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. జాతీ.య మీడియా ప్రతినిధులకు ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. బీజేపీని ఇంప్రెస్ చేయడానికి కేటీఆర్ గట్టిగా ప్రయత్నించారని అర్థమైపోయింది.  కేంద్రంలో బీజేపీ పాలనపై కేటీఆర్, హరీష్ రావు నోరెత్తలేదు. మోదీని విమర్శించలేదు. అలాంటి ప్రయత్నం చేయలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. లిక్కర్ కేసులో   బీజేపీ కక్ష పూరితంగా ఇరికించారనే ఆరోపణలు కూడా చేయలేకపోతున్నారు.

ఈడీ కావొచ్చు.. సీబీఐ కావొచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కింగ్‌పిన్ కవితే అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. బుధవారం కూడా ఈడీ ఇదే విషయాన్ని కో్టుకు చెప్ిపంది.  ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పని కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   కవితను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పాజిటివ్ సంకేతాలు ఉండబట్టే వారు ఢిల్లీలో ఉన్నారని అంటున్నారు.  బెయిల్ వస్తే మిగతా లాంఛనాలు పూర్తి చేసి అందరూ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెయిల్ వచ్చే సంకేతాలు ఉన్నందున  హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అయితే కేజ్రీవాల్ కు దిగువ కోర్టు బెయిల్ ఇచ్చిన హైకోర్టులో చుక్కెదురు అయింది. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏడాదికిపైగా జైల్లోనే ఉన్నారు. మరి వారెవరికీ రాని  బెయిల్ కవితకు వస్తుందా అన్న సందేహాలు కూడా కొంత మందిలో వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడల్లా ఎన్నికలు లేవు. బీఆర్ఎస్‌కు జరగాల్సిన  నష్టం జరిగిపోయింది. కనీసం కవితను అయినా బెయిల్ పై బయటకు తెచ్చేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉండిపోతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి