ఆ నియోజకవర్గం పేరు చెబితే ఎంతో మంది రాష్ట్ర రాజకీయాలు చక్రం తిప్పిన నేతలు గుర్తులు వస్తారు.. ఆ ప్రాంతానికి చెందిన వాళ్లే ఎంతో మంది ఎమ్మెల్యేలుగా, ఎంపిగాలు గెలిచారు… ఇప్పటికీ వివిధ పార్టీల నుంచి పోటీలోనూ ఉన్నారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో వరంగల్ ఉమ్మ జిల్లాలోనే కాదు… రాష్ట్రంలో గుర్తింపు పొందిన వర్థన్నపేటనియోజకవర్గ ప్రత్యేకతపై స్టోరీ..వర్ధన్న పేటలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా
కొందరు పరిచయం అవసం లేని నేతలు ఉంటారు. ఆలాంటి వాళ్లలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, బోయినపల్లి వినోద్‌కుమార్, పురుషోత్తమరావు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , కొండేటి శ్రీధర్, టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు, దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఎర్రబెల్లి స్వర్ణ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ తితిదే బోర్డు సభ్యుడు ఈగ మల్లేశం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లీస్టే తయారవుతుంది.. కానీ వీల్లందరిదీ ఒకే నియోజకవర్గం కావడంమే విశేషం. ఆ నేతలందరిదీ సొంత నియోజకవర్గం ఒకటే వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట.. ఇక్కడ నుంచి ఎదిగి ఇతర ప్రాంతాల్లోనే గెలిచి తమ సత్తా చాటారు..వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు
వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాల పరిధిలో ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో వర్ధన్నపేట పురపాలక సంఘంతోపాటు గ్రేటర్ వరంగల్‌లోని 41 గ్రామాలు విలీనం కాగా 11 డివిజన్లు ఉన్నాయి.
1952 నుంచి 2018 వరకు 15 సార్లు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. పీడీఎఫ్ అభ్యర్థిగా 1952లో పోటీ చేసిన పెండ్యాల రాఘవరావు విజయం సాధించి తొలి ఎమ్మెల్యేగా నిలిచారు. ఈ ఎన్నికల్లోనే ఆయన వరంగల్ ఎంపీగా, హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. అనంతరం 1957 నుంచి 2018 వరకు జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌సీ, స్వతంత్రులు, జేఎన్పీ, ఐఎన్‌సీ, బిజేపి , టీడీపి, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
మంత్రి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు2009లో జరిగిన పునర్విభజనలో ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరఫున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా… పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలబడ్డారు ఎర్రబెల్లి దయాకరరావు. మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి .
వర్ధన్నపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, టి.రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు, దుగ్యాల శ్రీనివాసరావు, నేతలు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు, ఎర్రబెల్లి స్వర్ణ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మాజీ తితిదే బోర్డు సభ్యుడు ఈగ మల్లేశం తదితరులు కూడా నియోజకవర్గం వారే. వీరంతా వివిధ హోదాల్లో పని చేశారుఇలా ఎంతో మంది రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతలను అందించిన అడ్డాగా వర్థన్నపేట నియోజకవర్గం గుర్తింపు పొందింది. ఈ సారి ఎవరికి ఇక్కడి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…