అది ముఖ్యమంత్రి సొంత జిల్లాతోపాటు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్ కూడ ఈ లోక్‌సభ స్దానం పరిధిలో ఉండటంతో అక్కడి ఫలితంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.బీజేపీ,కాంగ్రేస్ మద్య నువ్వా.నేనా అన్నట్టు సాగిన పోరులో గెలుపెవరది అనేదానిపై జోరుగా చర్చసాగుతుంది.కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో సీఎం వ్యూహం ఫలిస్తుందా…కాషాయం పార్టీ ఎత్తులు గట్టెక్కిస్తాయా మరోసారి గెలుపుకోసం గులాబీ పార్టీ చేసిన ప్రయత్నాలు ఏ మేరకు కలిసివస్తాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు జిల్లాలో హాట్‌టాపిక్ గా మారింది.
మహబూబ్‌నగర్ లోక్‌సభ స్దానంలో ఈసారి ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడి నుంచి 2019లో పోటీ పడిన అభ్యర్దులు తిరిగి బరిలో నిలిచారు.కాంగ్రేస్ పార్టీ నుంచి సీడబ్య్లూసీ ప్రత్యేక ఆహ్వనితుడు మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి,బీజేపీ నుంచి ఆపార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు,మాజీ మంత్రి డీకే అరుణ,బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి పోటీ పడ్డారు.ఈ స్దానం నుంచి 2014,2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధించారు.ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం 16 లక్షల 82 వేల 470 ఓట్లు ఉండగా 12 లక్షల 18 వేల 571 ఓట్లు అంటే 71.54 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
2019లో 65.39 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈసారి 6.15 శాతం ఓటింగ్ పెరిదింది.ఈ పెరిగిన ఓటింగ్ తమకంటే తమకే మేలు చేసిందని ఇటు బీజేపీ అటు కాంగ్రేస్ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు.ఇంట గెలిచి రచ్చగెలువాలన్న లక్ష్యంలో ఈ ఎన్నికలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించారు.తన సొంత జిల్లాతోపాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్ కూడ మహబూబ్‌నగర్ లోక్‌సభ స్దానం పరిధిలో ఉండటంతో ఎలాగైనా గెలిచి తీరాలన్నా కసితో పనిచేశారు. ఏకంగా ఆయన ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 11 సార్లు పర్యటించారంటే సీఎం ఇక్కడి గెలుపును ఎంత ప్రిస్జేజెస్‌గా తీసుకున్నారో అర్దం అవుతుంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో కాంగ్రేస్ పార్టీ అభ్యర్దులే విజయం సాధించారు.దీంతో ఇక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్ది వంశీచంద్‌రెడ్డి గెలుపు నల్లేరుమీద నడకే అని భావించారు.కాని బలమైన ప్రత్యర్ధి డీకే అరుణ ఉండటంతో ఇటు సీఎంతోపాటు పార్టీ నేతలు తీవ్రంగా కష్టించారు.మొదట ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా ఎన్నికల చివరి రోజుకు పోటీ కాంగ్రేస్,బీజేపీ మద్య అన్నట్టు…అదికాస్తా సీఎం రేవంత్‌రెడ్డి,డీకే అరుణ మద్యే అన్న రేంజ్‌కు వెళ్లింది.గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 5 అమలు చేశామని మిగిలినవి ఎన్నికల కోడ్ తర్వాత అమలు చేస్తామని సీఎంతోపాటు నేతలు విస్త్రుత ప్రచారం చేశారు.
జిల్లాకు 70 ఏళ్ల తర్వాత సీఎం అయ్యే అవకాశం తనకు వచ్చింది.వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ది చేసుకోవాలంటే జిల్లాలోని రెండు లోక్‌సభ స్దానాలు గెలిపించాలని సీఎం సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు.పార్టీలో కొత్తగా ఇతర పార్టీల నుంచి గెలిచిన నేతలు కాంగ్రేస్‌పార్టీలో కలవటం కూడ తమకు కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలేదని,ఆ పార్టీ జిల్లాకు ఏ మేలు చేయలేదని ఆలాగే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సైతం కేసీఆర్ జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని సీఎం ఆరోపణలు గుప్పిస్తూ తన ప్రసంగాలు చేశారు.
ఎన్నికల నాటికి చేతులెత్తేసిన బీఆర్ఎస్ లోపాయికారింగా బీజేపీతో కుమ్మక్కై క్రాస్‌ఓటింగ్ చేసిందని కాంగ్రేస్ నేతలు ఆరోపిస్తున్నారు.అయినా జనాలు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రేస్ నేతలు.మెజార్టీ తగ్గినా విజయం మాత్రం తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే సీఎం ఒక్క లోక్‌సభ స్దానంలో 11 సార్లు పర్యటించి ప్రచారం చేయటంతోపాటు వ్యక్తిగతంగా డీకే అరుణపై చేసిన ఆరోపణలు మైనస్‌గా మారినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. మొదటి నుంచి వ్యూహత్మకంగా అడుగులు వేసిన బీజేపీ అభ్యర్ది డీకే అరుణ జోరుగా ప్రచారం చేశారు.
ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె ఒంటరి పోరు చేశారు.ప్రధాని నరేంద్రమోఢీ కూడ నారాణయపేట సభలో పాల్గొని ప్రచారం చేయటం బీజేపీకి బూస్టునిచ్చింది.గత ఎన్నికల్లో రెండవ స్దానంలో ఉన్న బీజేపీ ఈసారి విజయం సాధిస్తుందనే ధీమా ఆపార్టీ నేతల్లో కనిపిస్తోంది.మోధి చరిష్మా…రామమందిర నిర్మాణం..ఉచిత బియ్యం సరఫరా ..కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలు కలిసి వస్తాయనే బీజేపీ భావిస్తోంది.కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు జరగలేదని..రుణమాఫీ చేయలేదని డీకే అరుణ విస్తృుత ప్రచారం చేశారు.ఈ ఎన్నికలు దేశానికి ప్రధాని ఎవరు కావాలనేదాని కోసం జరుగుతున్నాయి కాబట్టి మోధీని మరోసారి ప్రధాని చేసుకుని సుస్దిర భారతదేశానికి దోహదపడాలని పిలుపు నిచ్చారు.
ఇక బీఆర్ఎస్ అభ్యర్ది మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరపున కేటీఆర్,జిల్లాకు చెందిన మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్యేలు ప్రచారం సాగించారు.పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేశారు.దీనికి మంచి స్పందన రావటంతో ఈపార్టీ నేతల్లో ఆశలు చిగురించాయి కాని చివరికి త్రిముఖపోటీలో వెనుకబడిపోయినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం కౌంటింగ్ దగ్గర పడుతుండటంతో నేతలు నియోజకవర్గాల వారిగా గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. మరి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్దానంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం ఫలిస్తుందా…కాషాయ దళం కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…