పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల్లో అధికార పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. నామినేటెడ్ పదవుల సందడి మొదలైంది.లోక్‌సభ ఎన్నికలు సైతం పూర్తికావడంతో త్వరలోనే పెద్ద సంఖ్యలో ఉన్న నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారన్న ప్రచారం జోరుగాసాగుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం ప్రయత్నాలను సాగిస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులతో పాటు జిల్లా స్థాయిలోని నామినేటెడ్ పోస్టులకు తీవ్రమైన డిమాండ్ నెలకొంది.
ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ నేతలంతా ఈసారి తమకు తప్పకుండా అవకాశం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందటంతో ఆశావాహుల్లో ఆందోళన మొదలయ్యింది. పాలమూరు జిల్లాలో కాంగ్రేస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.మొత్తం 14 స్దానాల్లో 12 స్దానాల్లో పార్టీ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.దీంతో రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు ముమ్మర ప్రయత్నాలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలకు రాష్ట్రస్థాయి పదవులు వరించాయి. ప్రధానంగా పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించగా, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్, శివసేనారెడ్డికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, గురునాథ్‌రెడ్డికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, చింతలపల్లి జగదీశ్వరరావుకు మైనర్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అనుహ్యంగా లోక్‌సభ ఎన్నికల ముందు కమలం పార్టీ నుంచి హస్తం గూటికి చేరిన ఏపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలోరాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని పొందారు.
లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వటంతో ఇంకా పదవులు రాని ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.పదేళ్ల పాటు పార్టీని నమ్ముకుని కష్టపడ్డాం..బీఆర్ఎస్ పార్టీ నేతలు,ప్రజాప్రతినిధుల వేధింపులు భరించాం ఇప్పుడైనా తమకు స్దానం కల్పించాలని కొందరు పాత నేతలు కోరుతుంటే..కొత్తగా పార్టీలో చేరిన నేతలు సైతం తాము కాంగ్రేస్ పార్టీ గెలుపుకోసం కష్టపడ్డామని తమకు పదవులు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.దీంతో రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లాస్థాయిలోని నామినేటెడ్ పదవులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పాత వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేసింది. వీటి స్థానాల్లో కొత్త పాలకవర్గాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్, వైస్‌చైర్మన్, డైరెక్టర్ పదవులపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఉమ్మడి జిల్లాలోని ఒక్కో జిల్లాకు సుమారు 20 వరకు నామినేటెడ్ పదవులు ఉండగా, వీటిలో గ్రంథాలయ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రముఖ ఆలయాల చైర్మన్ పదవులకు కాంగ్రెస్ నేతల్లో పోటీ నెలకొంది.
జిల్లాలోని ప్రముఖ ఆలయాల చైర్మన్ పదవులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తమ పరిధిలోని పదవులను దక్కించుకునేందుకు జిల్లా ఇంచార్జీ మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ కాంగ్రెస్ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నాయకుల పనితీరు ప్రాతిపాదికనే నామినేటెడ్ పదవుల కేటాయింపు ఉంటుందని కాంగ్రెస్ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా పార్టీలోని సీనియర్, ముఖ్య నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని, ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలని వారిలో భరోసా కల్పించారు ఎన్నికల ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కూడ ఇదే ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో ఏళ్లుగా పార్టీకోసం పనిచేసినవారికి, గత ఎన్నికల్లో పనితీరు కనబరిచిన వారికే అధికార పదవులను కట్టబెట్టే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే పరిమిత సంఖ్యలో పదవులు ఉండగా, ఆశావహుల సంఖ్య అధికంగా ఉండటంతో నామినేటెడ్ పదవుల పంపిణీలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఈ స్థానంలో పట్టు సాధించాలని కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకుంది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో విజయం సాధించగా, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో అపజయం పాలైంది.
దీంతో పాటు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపాలయ్యారు. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తమ వారికి పెద్దసంఖ్యలో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని అడిగేందుకు ఎమ్మెల్యేలు సైతం వెనకాడుతున్నట్టు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నేతలకు నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో ఎంతటి ప్రాధాన్యత దక్కుతుందన్నది సందిగ్ధంగా మారింది.చూడాలి పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…