100 కోట్లకు బేరం కుదిరిందా?
మెగాస్టార్ మూవీ రేంజ్ బిజినెన్ చేస్తోన్న హాలీవుడ్ మూవీ?
డిసెంబర్ 16న వరల్డ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ అవతార్ -2 రిలీజ్ కానుంది. దాంతో సినిమా అభిమానుల ఫోకస్ అంతా జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టిపై పడనుంది. నవంబర్ 2న నయా ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా బిజినెస్ పూర్తి కానుంది. ఓ హాలీవుడ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు దాదాపు వంద కోట్లు ఆఫర్ చేస్తున్నారట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మెగా డీల్ ఇది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని, టాలీవుడ్ లోఅవతార్ సీక్వెల్ కు అంత క్రేజ్ ఉందా అనేది ఇఫ్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో రిలీజ్ అయితే చేయాల్సిన బిజినెస్ ను ఈ సినిమా చేస్తోంది. అవతార్ మొదటి భాగం తెలుగు నాట సంచలన విజయం సాధించింది. అందుకే సీక్వెల్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఓ ప్రముఖ నిర్మాత నమ్ముతున్నాడట. అదే స్పీడ్ లో అవతార్ 2 రికార్డ్ ప్రైజ్ తో కొనుగులు చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇక తమిళనాడు రైట్స్, అలాగే కేరళ రైట్స్ కూడా 100 కోట్లకు అడుగుతున్నారట. మొత్తంగా అవతార్ 2 వరల్డ్ వైడ్ గా ఉన్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటిని తుడిచి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.