ప్రేమలో హీరో, హీరోయిన్

By KTV Telugu On 1 November, 2022
image

గతంలోనే అనుమానం వచ్చింది…. ఇప్పుడు కన్ ఫామ్ అయింది అంతే?

మణిరత్నం డైరెక్ట్ చేసిన కడలి సినిమా గుర్తుందా, ఈ మూవీలో హీరోగా నటించాడు గౌతమ్ కార్తిక్. అలాగే నాగ చైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా మూవీ హీరోయిన్ మంజిమా మోహన్ గుర్తుందా? యూత్ కు బాగానే చేరువైన జంట ఇది. మంచి నటీ నటులుగా పేరు తెచ్చుకున్నారు. మంజిమా తర్వాత ఎన్టీఆర్ జీవితం పై తెరకెక్కిన బయోపిక్స్ లో నారా భువనేశ్వరి దేవి పాత్రను చేసింది. మంజిమా మలయాళీ, గౌతమ్ ప్రముఖ తమిళ హీరో కార్తిక్ తనయుడు,
ఈ ఇద్దరు కలసి తమిళంలో దేవరాట్టం సినిమా చేసారు. సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాతే రియల్ లైఫ్ లోనూ లవ్ మొదలైంది. ఈరోజు ఇన్ స్టా వేదికగా తమ లవ్ కన్ ఫామ్ చేసారు. మంజిమ, కార్తిక్ లవ్ స్టోరీ కోలీవుడ్ కు ఆల్రెడీ తెలుసు.
మిగితా ఇండస్ట్రీస్ లోని వీరి ఫ్యాన్స్ కు ఈ రోజు క్లారిటీ వచ్చింది. కార్తిక్ పక్కనుంటే ఏదైనా సాధించగలను అంటూ మంజిమ రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.