పంతం పట్టిన శ్రీదేవి…. పట్టించుకోని బోనీ కపూర్

By KTV Telugu On 27 October, 2022
image

శ్రీదేవి లోకాన్ని వీడి నాలుగు ఏళ్లు గడిచిపోయింది. ఆమె వెళ్లిపోయింది అంటే ఇప్పటకీ నమ్మలేని అభిమానులు ఉన్నారు. అతిలోకసుందరిని తలచుకుని బాధపడే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం శ్రీదేవి వారసత్వాన్ని కొనసాగించేందుకు బాలీవుడ్ లో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదటి నుంచి జాన్వీ అమ్మతో పోలీక పెట్టి చూడవద్దనే చెబుతూ వస్తోంది. అయితే మిలీ సినిమా ప్రమోషన్స్ లో ఎన్నడూలేని విధంగా తన తల్లి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది. తన తండ్రికి, తన తల్లికి మధ్య జరిగిన గొడవ గురించి చెప్పింది. శ్రీదేవికి తన భర్త బోనీ కపూర్ అంటే ప్రాణం. అయితే బోనీ సిగరెట్స్ తెగ తాగేవాడట. పెట్టెలు మీద పెట్టెలు కాల్చి పాడేసేవాడట. పిల్లలు పెద్దవారు అవుతున్నారు. సిగరెట్స్ మానేయమని శ్రీదేవి ఎన్నోసార్లు చెప్పి చూసిందట. బోనీ ఎంతకు వినకపోవడంతో నువ్వు సిగరెట్స్ మానేసే వరకు నేను నాన్ వెజ్ అనేది ముట్టను అని పంతం మీదకు వచ్చిందట. అయినా సరే బోనీ సిగరెట్స్ మానలేకపోయాడట. శ్రీదేవి కూడా నాన్ వెజ్ తినలేదట. అంతేకాదు తను వీక్ అవుతున్నా బోనీ మాత్రం సిగరెట్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడట. దాంతో శ్రీదేవి చాలా వరకు వీక్ నెస్ తోనే ఇబ్బంది పడిందట. శ్రీదేవి అనుకోని విషాదంతో లోకాన్ని వీడిన తర్వాత ఆమె కోసం సిగరెట్స్ మానేసాడట బోనీ కపూర్. ఇప్పటికీ ఆవిషయం తలచుకుని బాధపడున్నాడంట బోనీ. ఇదెదో అమ్మ బ్రతికి ఉన్నప్పుడు చేయాల్సింది కదా నాన్న అంటోంది జాన్వీ.