ఆంధ్ర రాజకీయాల్లో కులపోరు పతాక స్థాయికి
భారతీయులు పుట్టుకతోనే కులాన్ని పెనవేసుకుంటారు. చాలామందికి పేరులోనే కులం తెలిసిపోతుంది. పెళ్లయినా పండుగయినా కులమే ప్రాతిపదికగా జరగాల్సిందేననడంలో సందేహం లేదు. రాజకీయాలైనా అంతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా మన నేతలు ఎంతో లాఘవంగా కుల రాజకీయాలు చేస్తూ అధికార పీఠాన్ని పదిల పరుచుకుంటున్నారు. ఎక్కువ కాలం అధికారంలో ఉన్నదీ రెడ్డీ కమ్మ కులాలే అయినా బీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతూ వారిని ఆకట్టుకోగలుతున్నారు. కులాల భావోద్వేగాలను తమ రాజకీయ అస్త్రాలుగా మలుచుకుని […]